రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబోలో రాబోతున్న ‘పెద్ది’ మూవీ జూన్ 4న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో జూన్ 2న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్కు ప్లాన్ చేస్తున్నారట. పల్లెటూరు, క్రీడా నేపథ్యం ఉట్టిపడేలా ఈ వేడుకను డిజైన్ చేస్తున్నారట. ఈ స్పెషల్ ఈవెంట్కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథులుగా రానున్నట్లు టాక్.