KRNL: ఎమ్మిగనూరు పట్టణంలోని స్థానిక ఎంబీ చర్చ్, క్రాంతి నగర్ పరిసర ప్రాంతాలలో ఇవాళ ఉదయం మున్సిపల్ కమిషనర్ ఎన్. గంగిరెడ్డి విస్తృతంగా పర్యటించి, స్థానిక పౌర సౌకర్యాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆయన స్థానిక ప్రజలతో నేరుగా ముచ్చటించి, వారి సమస్యలను, అభిప్రాయాలను ఆరా తీశారు. నీటి సరఫరాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.