BHPL: సరస్వతి నది అంత్య పుష్కరాల సందర్భంగా కాళేశ్వరం త్రివేణి సంగమ తీరంలో ప్రత్యేక సంకల్ప పూజలు నిర్వహించారు. జ్ఞాన సరస్వతి ఘాట్ వద్ద కంచి పీఠాధిపతి జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతికి సాంప్రదాయ స్వాగతం పలికారు. అనంతరం గోదావరి–సరస్వతి నదులకు పుష్కర పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్ బాబు, అధికారులు పాల్గొన్నారు.