కోనసీమ: అమలాపురం శ్రీ సత్యనారాయణ గార్డెన్స్ నందు ఈ నెల 15 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించిన జాతీయ సబ్ జూనియర్, జూనియర్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్–2026 బుధవారం రాత్రితో ఘనంగా ముగిసాయి. దేశ వ్యాప్తంగా 29 రాష్ట్రాల నుంచి వచ్చిన 990 మంది మహిళా, పురుష పవర్ లిఫ్టర్లు పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.