NRML: సారంగాపూర్ మండలం యాకర్ పల్లికి చెందిన కామాటి చరణ్ (15) ట్రాక్టర్ ప్రమాదంలో మృతి చెందాడు. అదే గ్రామానికి చెందిన సత్యపాల్ రెడ్డి ట్రాక్టర్ను వ్యవసాయ పనుల కోసం నడుపుతూ బోరేగాం వెళ్తుండగా ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ట్రాక్టర్ అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో చరణ్ప ట్రాక్టర్ ఎక్కడంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు.