ADB: అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా నిర్మూలించాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. బజార్హత్నూర్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ను సందర్శించారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించి సిబ్బందితో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. గంజాయి, గుడుంబా, రాయితీ బియ్యం, పశువుల అక్రమ రవాణాపై దృష్టి సారించాలని సూచించారు.