KNR: కరీంనగర్‌ను రాష్ట్రంలో రెండో అతిపెద్ద ఐటీ హబ్‌గా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంతో యువతలో ఆశలు పెరిగాయి. రూ.34 కోట్లతో నిర్మించిన ఐటీ టవర్ ప్రారంభమై ఆరేళ్లు గడిచినా కంపెనీలు రాలేదు. ఐటీ మంత్రి శ్రీధర్ బాబు చొరవతో పరిస్థితి మారుతుందని నిరుద్యోగులు భావిస్తున్నారు. ఐటీ హబ్ అభివృద్ధి చెందితే ఉద్యోగవకాశాలు వస్తాయని నిరుద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.