ఏలూరు: కామవరపుకోట మండలం గుంటుపల్లి పంచాయతీకి చెందిన తుమ్మల లక్ష్మీనారాయణ ధర్మలింగ కట్టు చెరువులో గేదెలను బయటకు తోలటానికి దిగి ప్రమాదవశాత్తు మరణించాడు. మంగళవారం సాయంత్రం నుంచి గాలింపు చర్యలు చేపట్టగా లక్ష్మీనారాయణ మృతదేహం ఇవాళ లభ్యమైంది. కాగా లక్ష్మీనారాయణ ఎర్ర కాలువ లిఫ్ట్ ఇరిగేషన్లో లష్కర్గా పనిచేసేవాడు.