TG: HYDలోని జీడిమెట్ల అంబేద్కర్‌నగర్‌లో దారుణం జరిగింది. కొడుకుతో కలిసి, ఓ మహిళ తన ప్రియుడిని హతమార్చింది. ఏపీలోని అన్నమయ్య జిల్లాకు చెందిన శివారెడ్డితో గత పదేళ్లుగా మహిళ సహజీవనం చేస్తోంది. 19 ఏళ్ల కుమారుడు కూడా వాళ్లతోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో తల్లీ కొడుకులు మటన్ కొట్టే కత్తితో నరికి అతడిని హత్య చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.