SKLM: జి.సిగడాం మండలం ఆనందపురంలో కిమిడి రాజేశ్వరి (26) మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది. భర్త మద్యం, బెట్టింగ్లకు బానిసై తరచూ గొడవలు జరిగేవి. వారం క్రితం పిల్లలతో తల్లిదండ్రుల ఇంటికి వచ్చిన ఆమె, ఆదివారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.