KKD: SMలో వైరల్ గా మారిన వంటకాన్ని తిని కుటుంబం అస్వస్థకు గురైన ఘటన జల్లాలో చోటుచేసుకుంది. గండేపల్లి మండలం ఎర్రంపాలెంలో ఒక కుటుంబం ఇన్స్టా రీల్ చూసి ఉమ్మెత్త పువ్వుతో పప్పు వండుకుని తిన్నారు. అది తిన్న నలుగురు జయలక్ష్మి, గంగాభవాని, వీరలక్ష్మి, వీరబ్బులకు తీవ్ర వాంతులు అయ్యాయి. దీంతో వారిని కాకినాడ GGHక తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం.