TG: రంగారెడ్డి(D) చేవెళ్ల(M) నారాయణదాస్ గూడలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో తల్లీకూతురు ప్రాణాలు కోల్పోయారు. శ్రీనివాస్ అనే వ్యక్తి ఇంట్లో జరిగిన ఈ ప్రమాదంలో భార్య లావణ్య, కుమార్తె ప్రార్ధన తీవ్రంగా గాయపడ్డారు. వారిని మెరుగైన వైద్యం కోసం HYDలోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.