AP: అనకాపల్లి జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. పొలంలో ఒక్కసారిగా 400 కేవీ హైటెన్షన్ విద్యుత్ వైర్లు తెగిపడటంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో సమీపంలోని సరుగుడు తోట పూర్తిగా కాలి బూడిదైంది. సమాచారం అందుకున్న అధికారులు మంటలను అదుపు చేసే చర్యలు చేపట్టారు.