• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

కారు ఢీ.. వ్యక్తికి తీవ్ర గాయాలు

KKD: ముమ్మిడివరానికి చెందిన రాజులపూడి అనిల్ మంగళవారం కాకినాడ నుంచి యానాం వెళ్తుండగా వై జంక్షన్ వద్ద ప్రమాదానికి గురయ్యారు. గుర్తుతెలియని కారు అనిల్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న కోరంగి ఎస్సై సత్యనారాయణ రెడ్డి తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని, బాధితుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

April 28, 2026 / 06:00 PM IST

ఇద్దరు పిల్లలకు ఉరేసి తండ్రి ఆత్మహత్య

TG: మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో దారుణం జరిగింది. ఇద్దరు కుమారులకు ఉరి వేసి తర్వాత తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. తొర్రూరు మార్కెట్ ఎదురుగా పొలంలో షావలి అనే వ్యక్తి ఉరి వేసుకున్నాడు. పెద్ద కుమారుడు విలాస్ 5 ఏళ్లు, చిన్న కుమారుడు వికేష్‌కు 3 ఏళ్లు ఉంటాయి. కుటుంబ కలహాలే కారణమని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది.

April 28, 2026 / 11:39 AM IST

ప్రైవేట్ బస్సుకు ప్రమాదం.. ఒకరు మృతి

AP: కృష్ణా జిల్లా ఉయ్యూరులో ప్రైవేటు బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. 25 మందికి గాయాలయ్యాయి. విజయవాడ-మచిలీపట్నం రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. మృతుడు పోలవరం మండలం పాలరేవుకు చెందిన గణేష్‌గా గుర్తించారు.

April 28, 2026 / 07:55 AM IST

ఘోర ప్రమాదం.. నలుగురు మృతి

AP: విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పూసపాటిరేగ జాతీయ రహదారిపై లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

April 28, 2026 / 04:05 AM IST

పట్టాలు తప్పిన వందేభారత్ రైలు

మహారాష్ట్రలో వందేభారత్ రైలు పట్టాలు తప్పింది. ముంబై నుంచి సోలాపూర్ వెళ్తున్న ట్రైన్ పూణె స్టేషన్ సమీపిస్తుండగా రైలు పట్టాలు తప్పింది. రైలులోని ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటన కారణంగా పూణే మార్గంలో వెళ్లే ప్రధాన ఎక్స్‌ప్రైస్ రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. వందే భారత్ రైలు పట్టాలు తప్పడం ఇదే మొదటిసారని చెబుతున్నారు.

April 27, 2026 / 11:15 PM IST

కుప్పకూలిన విమానం.. 14 మంది మృతి

దక్షిణ సూడాన్‌లో జుబా నగారనికి సమీపంలో విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో పైలట్‌తో పాటు 13 మంది ప్రయాణికులు మృతిచెందారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్లే విమానం కూలిపోయి ఉండవచ్చని అధికారులు తెలిపారు. మృతి చెందిన ప్రయాణికుల్లో ఇద్దరిని కెన్యా జాతీయులుగా, మిగిలిన వారిని దక్షిణ సూడాన్ వాసులుగా గుర్తించారు. రెస్క్యూ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.

April 27, 2026 / 10:30 PM IST

BREAKING: క్రేన్ విరిగిపడి ముగ్గురు మృతి

TG: హైదరాబాద్‌లోని శంకరపల్లిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భారీ ఈదురు గాలుల ధాటికి NCC కన్స్ట్రక్షన్‌కు చెందిన ఒక భారీ క్రేన్ కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

April 27, 2026 / 06:17 PM IST

బహ్రెయిన్‌లో ఏపీ యువతి ఆత్మహత్య

AP: ఉపాధి కోసం బహ్రెయిన్ వెళ్లిన ప.గో.జిల్లా చిట్టవరానికి చెందిన వర్ధనపు కవిత(23) ఈ నెల 23న ఆత్మహత్యకు పాల్పడింది. నాలుగు నెలల క్రితమే వెళ్లిన ఆమె, పని చేసే ఇంట్లోనే ఉరేసుకున్నారు. సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. కవిత మృతదేహాన్ని స్వదేశానికి రప్పించాలని కోరుతూ కేంద్రమంత్రి శ్రీనివాసవర్మకు వినతిపత్రం అందజేశారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

April 27, 2026 / 10:13 AM IST

నాన్‌వెజ్ ఎందుకు వండలేదన్న భర్త.. చంపేసిన భార్య

TG: నాన్‌వెజ్ విషయంలో తలెత్తిన చిన్న గొడవ భర్తను భార్య హత్య చేసేవరకు వెళ్లింది. కామారెడ్డికి చెందిన శివాజీ(31) శనివారం రాత్రి నాన్‌వెజ్ ఎందుకు వండలేదని భార్య లక్ష్మీపై కోప్పడ్డాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరగగా, ఆగ్రహంతో లక్ష్మీ ఇంట్లో ఉన్న కొడవలితో శివాజీ మెడపై వేటు వేసింది. అతడు అక్కడికక్కడే మరణించాడు. వీరికి ఐదేళ్లు, రెండేళ్లున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

April 27, 2026 / 09:42 AM IST

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు ప్రమాదం

AP: కాకినాడ జిల్లా చెందుర్తి వద్ద జాతీయ రహదారిపై రోడ్డుప్రమాదం సంభవించింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఓ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో 15 మందికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

April 27, 2026 / 07:44 AM IST

శేషాచలం అడవిలో భారీ అగ్నిప్రమాదం

AP: తిరుపతి శేషాచలం అడవుల్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. జీవకోన సమీపంలోని మొండోడి కోన వద్ద ఆకతాయిలు పెట్టిన మంటలు వేగంగా విస్తరించి, సుమారు రెండు కిలోమీటర్ల మేర పచ్చని చెట్లను బూడిద చేశాయి. అటవీశాఖ కార్యాలయానికి సమీపంలోనే ఈ ఘటన జరిగింది. ఎర్రచందనం గోదాముల వరకు మంటలు వ్యాపించడంతో అధికారులు అప్రమత్తమై అదుపు చేసే చర్యలు చేపట్టారు.

April 27, 2026 / 07:39 AM IST

శేషాచలం అటవీ ప్రాంతంలో చెలరేగిన మంటలు

AP: శేషాచలం అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగాయి. జీవకోన సమీపంలోని మొండోడికోన వద్ద నుంచి తిమ్మినాయుడుకోన వద్దనున్న ఎర్రచందనం గిడ్డంగుల వరకు మంటలు వ్యాపించాయి. దీంతో దాదాపు 2 కి.మీ. మేర అటవీ ప్రాంతం దగ్ధమైంది. సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

April 27, 2026 / 12:16 AM IST

ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న వ్యాన్.. ఒకరు మృతి

SKLM: సారవకోట మండలం పెద్దలంబ రహదారిలో స్కూటీని వ్యాన్ ఢీకొనడంతో ఒకరు అక్కడకక్కడే మృతి చెందారు. ఎస్సై అనిల్ కుమార్ తెలిపిన వివరాల మేరకు పాతపట్నం మండలానికి చెందిన బత్తిలి గణపతి (34) తెంబురు నుంచి పెద్ద లంబ స్కూటీపై వస్తుండగా ఎదురుగా వస్తున్న వ్యాన్ ఢీకొనడంతో ఘటన జరిగిందన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.

April 26, 2026 / 07:25 PM IST

బస్టాండ్‌లో అగ్నిప్రమాదం.. ప్రయాణికులు పరుగులు

AP: విజయవాడ బస్టాండ్ మొదటి అంతస్తులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఎగ్జాస్ట్ ఫ్యాన్ల సమీపంలో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు బయటకు పరుగులు తీశారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో మొదటి అంతస్తులో ఉంచిన పాత ఫర్నిచర్, పాత కంప్యూటర్లు, దస్త్రాలు దగ్ధమయ్యాయి. 

April 26, 2026 / 06:42 PM IST

రూ.10కి సాంబార్ ఇవ్వలేదని తల్వార్‌తో దాడి

TG: సంగారెడ్డి జిల్లాలోని బీరంగూడలో మద్యం మత్తులో యువకుడు వీరంగం సృష్టించాడు. కర్రీ పాయింట్ నిర్వాహకుడు ఉదయ్‌పై తల్వార్‌తో దాడి చేశాడు. రూ.10కి సాంబార్ ఇవ్వలేదని జీవన్ దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఉదయ్‌కి తీవ్రగాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

April 26, 2026 / 12:34 PM IST