E.G: నగర శివారు కాతేరు ప్రాంతానికి చెందిన నాగేంద్ర ప్రవీణ్ (34) అనే యువకుడు రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజమండ్రి గోదావరి రైల్వే స్టేషన్ సమీపంలో శనివారం ఉదయం ఈ సంఘటన జరిగింది. ఆత్మహత్యకు కారణాలు ఇంకా తెలియలేదని చెబుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి రాజమండ్రి జీఆర్పీ సిబ్బంది కేసు నమోదు చేశారు.