2025-26 నాలుగో క్వార్టర్ ఫలితాల్లో OLA ఎలక్ట్రిక్ సంస్థ ఆదాయం గతేడాదితో పోలిస్తే భారీగా తగ్గిపోయింది. లాస్ట్ ఇయర్ రూ.611 కోట్ల ఆదాయం రాగా, ప్రస్తుతం రూ.265 కోట్లకే పరిమితమైంది. నష్టాలు మాత్రం రూ.870 కోట్ల నుంచి రూ.500కోట్లకు తగ్గాయి. EV మార్కెట్లో పోటీ పెరగడం, డిమాండ్ లేకపోవడం ఆదాయం క్షీణించడానికి కారణాలుగా భావిస్తున్నారు. ఈ క్వార్టర్లో 20,256 వాహనాలను డెలివరీ అయ్యాయి.