• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »టెక్

మారుతీ కార్లపై భారీ తగ్గింపు.. తెలుసా?

మారుతీ సుజుకి పలు మోడళ్ల కార్లపై భారీ తగ్గింపు ప్రకటించింది. బాలెనోపై క్యాష్ బెనిఫిట్ కింద రూ.15వేలు, ఎక్స్‌ఛేంజ్‌పై అదనంగా రూ.15వేల వరకు బోనస్ ఇస్తున్నట్లు తెలిపింది. ఫ్రాంక్స్‌పై నగదు బెనిఫిట్ కింద రూ.40 వేలు, అదనంగా రూ.10వేల వరకు ఎక్స్‌ఛేంజ్ బోనస్ ఇస్తున్నామంది. XL6పై రూ.45వేలు, విటారాపై రూ.50వేలు, ఇన్విక్టోపై రూ.2 లక్షల వరకు తగ్గింపు పొందొచ్చు.

April 7, 2026 / 09:03 AM IST

AI చాట్‌బాట్ వాడుతున్నారా?.. ఇలా చేయకండి

ChatGPT, Gemini తదితర చాట్‌బాట్‌లకు వ్యక్తిగత సమాచారం షేర్ చేయొద్దని నిపుణులు సూచిస్తున్నారు. బ్యాంక్ వివరాలు, పాస్‌వర్డ్స్ వంటివి ఇవ్వొద్దంటున్నారు. మెడికల్ అడ్వైజ్‌లూ తీసుకోవద్దని, అవి డాక్టర్ కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని చెబుతున్నారు. యూజర్లు షేర్ చేసిన/అడిగిన విషయాలను షేర్ చేసుకుంటాయని, ఇతరులకూ షేర్ చేసే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.

April 5, 2026 / 09:40 PM IST

కొత్త సుజుకి బర్గ్‌మన్ వచ్చేసింది

సుజుకి ఇండియా 2026 బర్గ్‌మన్ స్ట్రీట్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.1.02L కాగా, టాప్ వేరియంట్ ధర రూ.1.13L (ఎక్స్-షోరూమ్). టాప్ వేరియంట్‌లో TFT డిస్‌ప్లే, కీ ఫోబ్ వంటి స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి. 124cc ఇంజిన్, 24.6 లీటర్ల స్టోరేజ్, USB ఛార్జింగ్ దీని ప్రత్యేకతలు. మేక్ఓవర్ పొందిన LED లైటింగ్ దీనికి సరికొత్త లుక్ ఇచ్చింది.

April 4, 2026 / 12:48 PM IST

మారుతీ రికార్డు: భారీగా పెరిగిన సర్వీస్ సెంటర్లు! 

మారుతీ సుజుకీ తన సర్వీస్ నెట్‌వర్క్‌ను రికార్డు స్థాయిలో విస్తరించింది. ఒక్క ఏడాదిలోనే 502 కొత్త సర్వీస్ కేంద్రాలను ప్రారంభించి, దేశవ్యాప్తంగా మొత్తం సంఖ్యను 5,926కు చేర్చింది. వినియోగదారులకు మరింత చేరువ కావడమే లక్ష్యమని సంస్థ తెలిపింది. 2031 నాటికి ఈ కేంద్రాలను 8,000కు పెంచాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. గత మార్చితో పోలిస్తే అమ్మకాలు కూడా 5 శాతం పెరిగాయి.

April 3, 2026 / 10:08 PM IST

మహీంద్రా వాహనాల ధరల పెంపు

మహీంద్రా అండ్‌ మహీంద్రా SUVలు, వాణిజ్య వాహనాల ధరలను ఈనెల 6 నుంచి 2.5% వరకు పెంచనున్నట్లు ప్రకటించింది. సంప్రదాయ ఇంధన ఇంజిన్ల (ఐసీఈ)తో నడిచే SUVలు, వాణిజ్య వాహనాల సగటు ధరలు 1.6% పెరుగుతాయని కంపెనీ ప్రకటనలో తెలిపింది. మోడల్, వేరియంట్‌ను బట్టి ధరల పెంపు వేర్వేరుగా ఉంటుందని పేర్కొంది. XUV7 XO వాహనం ధర తొలి 40 వేల మంది కొనుగోలుదార్లకు మాత్రం పెరగదని వివరించింది.

April 3, 2026 / 08:56 AM IST

7000mAh బ్యాటరీతో రియల్‌మి 16 లాంచ్

రియల్‌మి 16 ఫోన్ 7000mAh బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్‌తో భారత్‌లో లాంచ్ అయింది. ఇందులో 50MP కెమెరా, IP69 వాటర్ రెసిస్టెన్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని ప్రారంభ ధర రూ.31,999. బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్‌ఛేంజ్ ద్వారా రూ.6,000 వరకు తగ్గింపు పొందవచ్చు. అద్భుతమైన డిస్‌ప్లే, పర్ఫార్మెన్స్‌తో ఈ ఫోన్ మీ బడ్జెట్‌లోనే లభిస్తోంది.

April 2, 2026 / 10:25 PM IST

2025-26లో 47 లక్షల కార్ల విక్రయాలు

భారత్‌లో 2025-26లో 47 లక్షల కార్ల విక్రయాలు జరిగాయి. మారుతీ సుజుకీ ఇండియా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 24,22,713 వాహనాలను విక్రయించినట్లు ఆ సంస్థ సీనియర్ ఎగ్జిక్యూటివ్ అధికారి పార్థో బెనర్జీ వెల్లడించారు. అలాగే, మహీంద్రా వాహన విక్రయాలు 20% వృద్ధితో 6,60,276కు చేరాయి. టాటా మోటార్స్ వార్షికంగా 15 శాతం వృద్ధితో 6.4 లక్షల వాహనాలను విక్రయించింది.

April 2, 2026 / 05:48 PM IST

రోడ్‌స్టర్ ధరను భారీగా తగ్గించిన ఓలా ఎలక్ట్రిక్

ప్రముఖ ఈవీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ తన ప్రీమియం మోటార్ సైకిల్ రోడ్‌స్టర్ ధరను భారీగా తగ్గించింది. 4680 భారత్ సెల్‌పై రూపొందిన ఈ బైక్ ధరను ఏకంగా రూ.60 వేలు తగ్గిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం దీని ధర రూ.1,89,999 ఉండగా.. రూ.1,29,999కు తగ్గిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. రేపు సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు కొనుగోలు విండోను తెరవనున్నట్లు ఓలా ప్రతినిధి తెలిపారు.

April 2, 2026 / 03:03 PM IST

రాణించిన ఓలా ఎలక్ట్రిక్‌

ఓలా ఎలక్ట్రిక్ మళ్లీ పుంజుకుంది. మార్చి నెల చివరి వారంలో రోజుకు సగటున వెయ్యి యూనిట్లు విక్రయించినట్లు కంపెనీ పేర్కొంది. మార్చి మొత్తానికి 10,117 రిజిస్ట్రేషన్లు పూర్తైనట్లు తెలుస్తోంది. కస్టమర్లలో పెరిగిన విశ్వాసం కారణంగా భారీ వృద్ధి నమోదైనట్లు కంపెనీ అధికార ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. మొత్తంగా 1 మిలియన్ విక్రయాలు సాధించిన తొలి ఈవీ కంపెనీగా నిలిచినట్లు తెలిపారు.

April 1, 2026 / 02:46 PM IST

TRAI కొత్త యాప్.. SPAM కాల్స్‌కు చెక్

నిత్యం వేధిస్తున్న స్పామ్ కాల్స్, మెసేజ్‌ల బెడదకు చెక్ పెట్టేందుకు TRAI తన ‘DND’ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్‌లో రిజిస్టర్ చేసుకుని అనవసర ప్రమోషనల్ కాల్స్‌ను సులభంగా బ్లాక్ చేయవచ్చు. నిబంధనలు ఉల్లంఘించిన సుమారు 1.84L నంబర్లను గతేడాది TRAI తొలగించింది. ఇందులో మనకు నచ్చిన కేటగిరీల నుంచి మాత్రమే మెసేజ్‌లు వచ్చేలా సెట్టింగ్స్ మార్చుకోవచ్చు.

April 1, 2026 / 10:48 AM IST

బజాజ్ నుంచి రెండు కొత్త 350cc బైక్‌లు

బజాజ్ తన పాపులర్ మోడల్స్ పల్సర్ NS400Z, డామినార్ 400 స్థానంలో 350cc వెర్షన్లను ఈ నెలలో విడుదల చేయనుందట. ట్రయంఫ్‌తో కలిసి 350cc శ్రేణిని తీసుకొస్తున్న తరుణంలో, ‘పల్సర్ NS350Z’, ‘డామినార్ 350’ మార్కెట్లోకి రానున్నాయి. పాత 400cc మోడళ్ల ఉత్పత్తిని నిలిపివేసినట్లు సమాచారం. ఆకర్షణీయమైన ధరలతో రానున్న ఈ బైక్‌లు వాహన ప్రియులను ఆకట్టుకోనున్నాయి.

April 1, 2026 / 09:23 AM IST

యూజర్లకు చుక్కలు చూపిస్తున్న ‘X’

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X'(ట్విట్టర్) యూజర్లకు షాక్ ఇచ్చింది. నిన్న అర్ధరాత్రి నుంచి X సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. పేజీలు లోడ్ కాకపోవడం, లాగిన్ సమస్యలతో వేలాది మంది ఇబ్బంది పడ్డారు. డౌన్‌డిటెక్టర్ నివేదికల ప్రకారం ఈ సమస్య ప్రపంచవ్యాప్తంగా ఉంది. అయితే, దీనిపై సంస్థ యాజమాన్యం ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో యూజర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

April 1, 2026 / 08:10 AM IST

‘3-2-1’ నియమంతో మీ ఫొటోలు, ఫైల్స్ భద్రం

ఇవాళ ‘వరల్డ్ బ్యాకప్ డే’. డేటా భద్రత ప్రాముఖ్యతను ఈరోజు గుర్తుచేస్తోంది. మన ఫొటోలు, ఫైల్స్ పోకుండా ఉండాలంటే ‘3-2-1’ సూత్రం తప్పనిసరి. అంటే.. ఒరిజినల్‌తో కలిపి మొత్తం 3 కాపీలు ఉండాలి. వీటిని కనీసం 2 వేర్వేరు రకాల స్టోరేజీల్లో(హార్డ్ డిస్క్, పెన్ డ్రైవ్) సేవ్ చేయాలి. అందులో 1 కాపీని కచ్చితంగా క్లౌడ్‌లో భద్రపరచాలి. మీ డిజిటల్ జ్ఞాపకాలు ఎప్పటికీ సురక్షితంగా ఉంటాయి.

March 31, 2026 / 12:32 PM IST

కస్టమర్లకు MG మోటార్స్ షాక్

JSW MG మోటార్ ఇండియా తన కస్టమర్లకు షాక్ ఇచ్చింది. ఎంపిక చేసిన మోడళ్లపై 2 శాతం వరకు ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. పెరిగిన తయారీ ఖర్చుల (Input Costs) నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ కొత్త ధరలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. కావున మీరు MG కారు కొనాలని భావిస్తే, పాత ధరలకే సొంతం చేసుకునేందుకు ఇదే సరైన సమయం.

March 30, 2026 / 02:40 PM IST

యుద్ధం ఎఫెక్ట్.. EV వైపు మళ్లుతున్న జనం!

పశ్చిమాసియాలో యుద్ధం వల్ల చమురు కొరత ఏర్పడవచ్చన్న వార్తలతో హైదరాబాద్ పెట్రోల్ బంకుల వద్ద రద్దీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఇబ్బందులు భరించలేక చాలా మంది వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాల(EV) వైపు మళ్లుతున్నారు. షోరూమ్‌ల వద్ద వినియోగదారులు తమ గోడు వెళ్లగక్కుతున్నారు. దీంతో గత 2 రోజులుగా ఎలక్ట్రిక్ స్కూటర్ల విక్రయాలు అమాంతం పెరిగాయని షోరూమ్ యజమానులు చెబుతున్నారు.

March 26, 2026 / 01:14 PM IST