దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకి ‘ఇగ్నిస్’ ఉత్పత్తిని నిలిపివేసింది. అమ్మకాలు పడిపోవడం, డిమాండ్ తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నెల రోజులుగా ఈ కార్ల ఉత్పత్తి నిలిచిపోయిందని డీలర్లు చెబుతున్నారు. కొత్త బుకింగ్లను సైతం తీసుకోవట్లేదు. 2017లో విడుదలైన ఈ ప్రీమియం అర్బన్ కాంపాక్ట్ హ్యాచ్బ్యాక్ కారు ధర రూ.4.59 లక్షల నుంచి రూ.7.80 లక్షల మధ్య ఉండేది.