డ్రగ్స్ కేసులో టాలీవుడ్ నటుడు నవదీప్‌నకు హైకోర్టులో ఊరట లభించింది. అతడిపై గతంలో నమోదైన డ్రగ్స్ కేసును హైకోర్టు కొట్టేసింది. నవదీప్ వద్ద డ్రగ్స్ దొరకలేదని, నిందితుడి వివరాల ఆధారంగా నవదీప్‌ను కేసులో చేర్చారని అతడి తరఫు న్యాయవాది పేర్కొన్నాడు. ప్రస్తుతం నాంపల్లి కోర్టులో విచారణ దశలో ఉన్న ఈ కేసును కొట్టివేస్తూ ధర్మాసనం తీర్పు వెలువరించింది.
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన హర్రర్ థ్రిల్లర్ ‘భ్రమయుగం’ అరుదైన ఘనత సాధించింది. ఆస్కార్ అకాడమీ మ్యూజియంలో ఈ సినిమాను ప్రదర్శించనున్నారు. లాస్ ఏంజెల్స్‌లోని అకాడమీ మ్యూజియంలో ఫిబ్రవరి 12న నిర్వహించనున్న ‘వేర్ ద ఫారెస్ట్ మీట్స్ ద సీ’ అనే వేడుకలో ఈ సినిమాను టెలికాస్ట్ చేయనున్నారు. దీంతో ఈ వేడుకకు ఎంపికైన ఏకైక భారతీయ సినిమాగా ఇది రికార్డు సృష్టించింది.
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’ మూవీకి షాక్ తగిలింది. ఈ మూవీ టికెట్ ధరల పెంపును సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ విషయాన్ని సింగిల్ బెంచ్ వద్ద మెన్షన్ చేస్తూ లాయర్ శ్రీనివాస్.. అర్ధరాత్రి టికెట్ ధరలు పెంచుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. ఈ పిటిషన్‌పై విచారణ జరగనుంది.
కన్నడ హీరో యష్, దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ ‘టాక్సిక్’ మూవీ టీజర్‌పై దర్శకుడు RGV పోస్ట్ పెట్టాడు. ‘ఈ టీజర్ చూసిన తర్వాత ఈ మూవీని గీతూ తెరకెక్కిస్తుందంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఆమె మహిళలకు అల్టిమేట్ రోల్ మోడల్‌గా భావిస్తున్నా. ఏ మగ డైరెక్టర్ కూడా ఆమెకు సరితూగరు. ఈ టీజర్లో వచ్చే ఒక షాట్‌ని ఆమె తీసిందంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నా’ అంటూ రాసుకొచ్చాడు.
తమిళ హీరో శివకార్తికేయన్ నటించిన ‘పరాశక్తి’ మూవీ విడుదలకు లైన్ క్లియర్ అయింది. ఈ సినిమా సెన్సార్ ఇష్యూ క్లియర్ అయింది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ జారీ చేసింది. 2:42 గంటల రన్ టైంతో జనవరి 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కాగా, దర్శకురాలు సుధా కొంగర తెరకెక్కించిన ఈ మూవీలో శ్రీలీల, జయం రవి, అథర్వ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
మహేష్ బాబు సోదరుడు రమేష్ తనయుడు జయకృష్ణ హీరోగా నటిస్తోన్న మూవీ ‘శ్రీనివాస మంగాపురం’. ఈ సినిమా కోసం మహేష్ బాబు రంగంలోకి దిగాడు. జనవరి 10న ఉదయం 10:30 గంటలకు జయకృష్ణ ఫస్ట్ లుక్‌ను మహేష్ రిలీజ్ చేయనున్నాడు. ఇక దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో బాలీవుడ్ నటి రాషా తడాని కథానాయికగా నటిస్తుండగా.. GV ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు.
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన హర్రర్ కామెడీ థ్రిల్లర్ ‘రాజాసాబ్’ ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా ఈ మూవీ నాన్ థియేట్రికల్ రైట్స్‌పై అప్డేట్ వచ్చింది. దీని డిజిటల్ రైట్స్‌ను జియో హాట్‌స్టార్ సొంతం చేసుకుంది. ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటి వారంలో సదరు OTTలో స్ట్రీమింగ్ కానున్నట్లు టాక్. శాటిలైట్ హక్కులను స్టార్ మా ఛానల్ సొంతం చేసుకున్నట్లు సమాచారం.
విజయ్ దళపతి నటించిన ‘జన నాయగన్’ మూవీకి U/A సర్టిఫికెట్ ఇవ్వాలని సెన్సార్ బోర్డును మద్రాస్ హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ సెన్సార్ బోర్డు డివిజన్ బెంచ్‌లో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో ఈ సినిమా విడుదలపై విజయ్ అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
నటి అవికా గోర్ తల్లి కాబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇటీవల ‘కొత్త ప్రారంభం’ అంటూ ఆమె పెట్టిన పోస్టుతో ఈ వార్తలు పుట్టుకొచ్చాయి. తాజాగా వీటిపై అవికా స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. నిజానికి ఆ వార్తలు చూసి తనకు కోపం రాలేదని, నవ్వు వచ్చిందని తెలిపింది. నిజంగానే ఓ పెద్ద గుడ్ న్యూస్ ఉందని, త్వరలోనే దాని గురించి చెబుతానని పేర్కొంది.
తమిళ హీరో దళపతి విజయ్ నటించిన ‘జన నాయగన్’ మూవీకి మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. ఈ సినిమా సెన్సార్ విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ ఇవ్వాలని సెన్సార్ బోర్డును ఆదేశించింది. దీంతో ‘జన నాయగన్’ విడుదలకు లైన్ క్లియర్ అయింది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించే అవకాశం ఉంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’ మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. తాజాగా ఈ సినిమాకు పార్ట్2ను మేకర్స్ ప్రకటించారు. దీనికి ‘రాజాసాబ్ సర్కస్:1935’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు సినిమా ఎండింగ్లో వెల్లడించారు. అయితే ఇది సీక్వెలా లేదా ప్రీక్వెలా అనేది తెలియాల్సి ఉంది. ఈ ప్రకటనతో రెబల్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.
‘కాంతార 1’, ‘మహావతార్ నరసింహ’ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి. ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల రేసులో ఇవి నిలిచాయి. తాజాగా ఈ మూవీలు ఆస్కార్ అవార్డ్స్ జనరల్ ఎంట్రీలో స్థానం సంపాదించుకున్నాయి. దీంతో ఉత్తమ నటుడు, నటి, డైరెక్టర్, నిర్మాత, స్క్రీన్ ప్లే, ప్రొడక్షన్ డిజైన్, సినిమాటోగ్రఫీ కేటగిరీల్లో ఈ సినిమాలు పోటీపడనున్నాయి. ఈ మేరకు హోంబలే ఫిల్మ్స్ Xలో పోస్టు చేసింది.
బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ అడ్వెంచర్ హాలీవుడ్ మూవీ ‘ది బ్లఫ్’. ఈ సినిమా విడుదల తేదీని అమెజాన్ ప్రైమ్ ప్రకటించింది. 2026 ఫిబ్రవరి 25 నుంచి సదరు OTTలో స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించింది. తాను ప్రేమించే వారిని కాపాడాలనే లక్ష్యంతో హీరోయిన్ కత్తి యుద్ధాలు, వ్యూహాత్మక పోరాటాల నేపథ్యంతో ఈ సినిమా రాబోతుందట.
నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన మూవీ ‘అఖండ 2’. 2025 డిసెంబర్లో రిలీజైన ఈ సినిమా OTTలోకి వచ్చేసింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక 14 రీల్స్ ప్లస్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాలో సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి, హర్షాలీ మల్హోత్రా తదితరులు కీలక పాత్రలు పోషించారు.
‘రాజాసాబ్’ సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది. ఇవాళ్టి నుంచి ఈనెల 11 వరకు మల్టీప్లెక్స్‌ల్లో రూ.132, సింగిల్ స్క్రీన్లలో రూ.105 పెంపునకు అనుమతి ఇచ్చింది. 12 నుంచి 18 వరకు మల్టీప్లెక్స్‌ల్లో రూ.89, సింగిల్ స్క్రీన్లలో రూ.62 పెంపునకు అనుమతి ఇచ్చింది. టికెట్ లాభాల్లో 20 శాతం ఫిలిం ఫెడరేషన్‌కు ఇవ్వాలని తెలిపింది.