• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »సినిమా

నాని బ్యానర్‌లో ఫ్రాంచైజీగా ‘కోర్ట్’

నాని నిర్మాతగా వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై నిర్మించిన ‘కోర్ట్’ మూవీ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. అయితే ‘హిట్’ తరహాలో ‘కోర్ట్’ మూవీని కూడా ఫ్రాంచైజీగా తీర్చిదిద్దాలని నిర్మాత నాని భావిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో ‘కోర్ట్’ సీక్వెల్స్ కోసం కథలను సిద్ధం చేస్తారని.. ప్రతి సినిమాలో ఒక్కో కేసు గురించి చర్చించనున్నట్లు టాక్ నడుస్తోంది.

March 17, 2025 / 02:21 PM IST

‘పుష్ప 3’ రిలీజ్ అయ్యేది అప్పుడే

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కిన ‘పుష్ప 1, 2’ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ‘పుష్ప 3’ కూడా ఉండనున్నట్లు గతంలో మేకర్స్ ప్రకటించారు. తాజాగా ఈ సినిమాను 2028లో రిలీజ్ చేయనున్నట్లు నిర్మాత రవి శంకర్ తెలిపారు. ‘రాబిన్‌హుడ్’ ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఆయన.. ప్రస్తుతం బన్నీ దర్శకుడు అట్లీతో సినిమా చేస్తున్నట్లు ప...

March 16, 2025 / 02:21 PM IST

‘కోర్ట్’ తొలి రోజే అదిరిపోయే ఓపెనింగ్స్

హీరో నాని సమర్పణలో ప్రియదర్శి, హర్ష్ రోషన్, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘కోర్ట్’. నిన్న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు ప్రీమియర్స్‌తో కలిపి మొదటి రోజే అదిరిపోయే ఓపెనింగ్స్ వచ్చాయి. ఈ చిత్రం రూ.8.10 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించినట్లు మేకర్స్ పోస్టర్ షేర్ చేశారు. ఇక ఇది ప్రియదర్శి కెరీర్‌లోనే బెస్ట్ ఓపెనింగ్ అని సినీ వర్గాలు పేర్కొన్నాయి.

March 15, 2025 / 11:24 AM IST

స్టార్ హీరోకు గాయం.. ‘వార్ 2’ వాయిదా?

స్టార్ హీరోలు హృతిక్‌ రోషన్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘వార్ 2’. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో స్పై థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఓ పాట చిత్రీకరణ సమయంలో హృతిక్ గాయపడినట్లు ప్రచారం జరుగుతోంది. నెల రోజులు రెస్ట్ తీసుకోవాలని వైద్యులు వైద్యులు సూచించినట్లు సమాచారం. దీంతో సినిమా విడుదల వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

March 11, 2025 / 08:28 AM IST

హీరోయిన్ రష్మికకు కొడవ సామాజికవర్గం మద్దుతు

హీరోయిన్ రష్మిక మందన్నకు కొడవ సామాజికవర్గం మద్దుతుగా నిలిచింది. రష్మికకు భద్రత కల్పించాలని కేంద్రం, రాష్ట్రాలకు కొడవ సామాజికవర్గం అధ్యక్షుడు నాచప్ప లేఖ రాశారు. హీరోయిన్‌పై ఎమ్మెల్యే రవి గనిగ నిత్యం విమర్శలు చేస్తునే ఉన్నారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే వెంటనే ఆమెకు భద్రత కల్పించాలని కోరారు.

March 10, 2025 / 11:19 AM IST

సంకల్ప్ రెడ్డి కాంబోలో గోపీచంద్ కొత్త మూవీ

మాచో స్టార్ గోపీచంద్, ఘాజీ ఫేమ్ దర్శకుడు సంకల్ప్ రెడ్డి కాంబోలో సరికొత్త మూవీ తెరకెక్కనుంది. శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న భారీ బడ్జెట్ మూవీ పూజా కార్యక్రమాలతో ఇవాళ ప్రారంభమైంది. 7వ శతాబ్దపు భారతీయ చారిత్రక సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ చిత్రంలో గోపీచంద్ ఇదివరకు ఎన్నడూ చూడని అవతారంలో కనిపించనున్నారని పేర్కొన్నారు.

March 10, 2025 / 11:15 AM IST

అట్టహాసంగా ఐఫా అవార్డుల వేడుక

పింక్ సిటీ జైపూర్ వేదికగా ఐఫా అవార్డుల వేడుక ప్రారంభమైంది. రెండు రోజులపాటు జరగనున్న ఈ వేడుకలో నిన్న OTTలో మంచి ఆదరణ దక్కించుకున్న మూవీలు, సిరీస్‌లకు అవార్డులు ఇచ్చారు. ఉత్తమ చిత్రంగా అమర్ సింగ్ చంకీలా, ఉత్తమ సిరీస్‌గా పంచాయత్ సీజన్ 3లు అవార్డులు అందుకున్నాయి. ఉత్తమ నటుడిగా విక్రాంత్ మాస్సే(సెక్టార్ 36), నటిగా కృతి సనన్ (దో పత్తి)గా నిలిచారు.

March 9, 2025 / 11:12 AM IST

‘జిగ్రా’ పరాజయంపై అలియా భట్ స్పందన

‘జిగ్రా’ సినిమా పరాజయంపై బాలీవుడ్ నటి అలియా భట్ స్పందించారు. ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని, దానికి ఆదరణ లభించకపోయినా తాను ఉత్సాహంగానే ఉన్నట్లు చెప్పారు. ఆ సినిమా నుంచి కొత్త పాఠాలు నేర్చుకున్నట్లు తెలిపారు. సినిమా ఫలితాలు తనని ప్రభావితం చేయవు అని, సినీ రంగంలో జయాపజయాలు సహజమని పేర్కొన్నారు.

March 6, 2025 / 11:25 AM IST

OTTలోకి శర్వా ‘మనమే’.. ఎప్పుడంటే?

టాలీవుడ్ హీరో శర్వానంద్, కృతి శెట్టి జంటగా నటించిన సినిమా ‘మనమే’. శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించిన ఈ సినిమా రిలీజై దాదాపు 9నెలలు పూర్తయినా.. ఇప్పటివరకు OTTలోకి రాలేదు. అయితే ఈ సినిమా OTTలోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్‌లో ఈ నెల 9 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. కాగా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

March 3, 2025 / 11:20 AM IST

తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్

బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ గుడ్ న్యూస్ చెప్పారు. తాను తల్లి కాబోతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దీంతో నెటిజన్లు ఆమెకు కంగ్రాట్స్ చెబుతున్నారు. తన ప్రియుడు, నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాను కియారా 2023లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

February 28, 2025 / 02:17 PM IST

అందుకే ఆ పాత్రను అలా చూపించాను: సందీప్ వంగా

‘యానిమల్’ సినిమాలో విలన్‌గా నటించి బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విశేష ఆదరణ సొంతం చేసుకున్నారు. అయితే ఈ మూవీలో విలన్ పాత్రను అలా చూపించడంపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా స్పందించారు. ‘ప్రతి సినిమాలో హీరో, విలన్ మధ్య మాటల యుద్ధాలు చూస్తూనే ఉంటాం. అందుకే కాస్త విభిన్నంగా చూపించాలనే ఉద్దేశంతోనే ఆ పాత్రను అలా క్రియేట్ చేశా’ అని చెప్పారు. 

February 28, 2025 / 11:20 AM IST

‘రంగస్థలం’.. ఆ సీన్ వల్ల భయమేసింది: ఆది

నటుడు ఆది పినిశెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రంగస్థలం సినిమా తనకు తెలుగు, తమిళంలో మంచి పేరు తెచ్చినట్లు చెప్పాడు. ‘రంగస్థలం ఇప్పుడు విడుదలయ్యుంటే పాన్ ఇండియా స్థాయిలో ఆదరణ పొందేది. ఆ మూవీలో నేను చనిపోయినట్లు నటించిన సన్నివేశం ఉంది. అప్పుడు నా చుట్టూ ఉన్న నటీనటుల యాక్టింగ్ చూసి చాలా భయం వేసింది. థియేటర్లో ఆ సీన్ చూసి మా నాన్న కన్నీళ్లు పెట్టుకున్నారు’ అని చెప్పుకొచ్చాడు.

February 26, 2025 / 11:25 AM IST

వారి వారసులకు సారీ చెప్పిన దర్శకుడు

ఛావా సినిమాలో తమ పూర్వీకులను తక్కువ చేసి చూపించారని గానోజీ, కన్హోజీ షిర్కే వారసులు ఆరోపించారు. దీనిపై దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ స్పందించారు. ‘వారి కుటుంబీకులకు క్షమాపణలు చెబుతున్నా. గానోజీ, కన్హోజీలను తప్పుగా చూపించే ఉద్దేశం నాకు ఏమాత్రం లేదు. అందుకే వారికి సంబంధించిన వివరాలు, వారు ఏ ప్రాంతానికి చెందినవారు అనే అంశాలను ఎక్కడా చూపించలేదు’ అని పేర్కొన్నారు.

February 24, 2025 / 02:26 PM IST

OTTలో అదరగొడుతోన్న ‘డాకు మహారాజ్’

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన ‘డాకు మహారాజ్’ మూవీ OTTలో అదరగొడుతోంది. నెట్‌ఫ్లిక్స్‌లో దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతోన్న సినిమాల్లో ఇది టాప్‌లో నిలిచింది. అలాగే బంగ్లాదేశ్, మాల్దీవ్స్, శ్రీలంక, పాకిస్తాన్ తదితర దేశాల్లో టాప్ 2‌లో ట్రెండ్ అవుతోంది. ఇక బాబీ తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజై రూ.170 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టింది.

February 23, 2025 / 02:27 PM IST

‘ఛావా’కు పన్ను మినహాయింపు.. ఎక్కడంటే?

ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘ఛావా’ థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ సినిమా ప్రజలకు మరింత చేరువ కావాలనే ఉద్దేశంతో పలు రాష్ట్రాలు దీనికి పన్ను మినహాయింపు ప్రకటించాయి. మధ్యప్రదేశ్, గోవా రాష్ట్రాల్లో ఈ సినిమాకు పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు ఆయా ప్రభుత్వాలు ప్రకటించాయి. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి సానుకూలంగా స్పందించింది.

February 20, 2025 / 11:24 AM IST