నాచురల్ స్టార్ నాని, కయాదు లోహర్ జంటగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న చిత్రం ‘ది ప్యారడైజ్’. ఈ మూవీ నుంచి మొదటి సాంగ్ ‘ఆయా షేర్’ నిన్న వచ్చేసింది. ఈ పాట అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. అయినప్పటికీ ఈ సాంగ్ పై నెట్టింట నెగిటివ్ ప్రచారం సాగుతోంది. ఈ పాట మలయాళం అంటూ ట్రోల్ చేస్తున్నారు. నాని వేసిన డాన్స్ మూమెంట్స్ కూడా బాలేవని విమర్శిస్తున్నారు.