రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ భారీ విజయం సాధించాలని కోరుకుంటూ, చిత్ర బృందానికి పవన్ కళ్యాణ్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. దీనిపై చరణ్ స్పందిస్తూ సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్ పెట్టాడు. ‘మీ ఆత్మీయ శుభాకాంక్షలకు ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ గారూ.. మీ మాటలు నాకు, మా పెద్ది చిత్ర బృందం మొత్తానికి ఎంతో విలువైనవి. మీ ప్రేమ, మద్దతు, ఆశీస్సులకు మేము ఎల్లప్పుడూ కృతజ్ఞులం’ అంటూ ట్వీట్ చేశాడు.
కుంభమేళా మోనాలిసా, ఫర్మాన్‌ఖాన్‌ల మతాంతర వివాహ కేసులో కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. MPలో నమోదైన కిడ్నాప్, పోక్సో కేసుల నేపథ్యంలో ప్రాణహాని ఉందంటూ ఈ జంట ముందస్తు బెయిల్ పిటిషన్ వేసింది. దీనిపై స్పందించిన న్యాయమూర్తి.. “మీరు కేరళలో ఉండటం మీ అదృష్టం” అనగా, అందుకే వీరు బతికున్నారని లాయర్ పేర్కొన్నారు. కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
ప్రభాస్, సందీప్ రెడ్డి వంగాల ‘స్పిరిట్’ మూవీ షూటింగ్ HYDలో జోరుగా సాగుతోంది. ఈ ఏడాది నవంబర్ కల్లా షూట్ ముగించి, 2027 మార్చి 5న సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కాగా, అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా పవర్‌ఫుల్ టీజర్ విడుదల కానుందట. దీంతో ఈసారి రెబెల్ స్టార్ బర్త్‌డేకి థియేట్రికల్ బ్లాస్ట్ ఖాయమని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
‘పెద్ది’ ప్రమోషన్స్‌లో దర్శకుడు బుచ్చిబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఈ కథను పూర్తిగా చరణ్ కోసమే రాశాను. ఆయన కోరుకున్నట్టుగానే ఇదొక స్పోర్ట్స్ డ్రామా. ఇది కల్పిత కథే అయినా.. విజయనగరం కుర్రాడిని చూస్తున్నట్లే ఉంటుంది. మూవీలో చరణ్ ఎప్పుడో కానీ కనిపించడు, అంతా పెద్ది పాత్ర హవానే నడుస్తుంది. అతని ఆట, పాట, భావోద్వేగాలతో సాగే పక్కా కమర్షియల్ చిత్రమిది’ అని అన్నాడు.
కన్నడ స్టార్ యష్ చేసిన పనికి అభిమానులు ఫిదా అవుతున్నారు. క్యాన్సర్‌తో పోరాడుతున్న తన వీరాభిమాని, శివమొగ్గ జిల్లా ఫ్యాన్స్ ప్రెసిడెంట్ సునీల్‌కు వీడియో కాల్ చేసి ధైర్యం చెప్పాడు. వరుస మూవీలతో బిజీగా ఉన్నా, అభిమాని కోసం సమయం కేటాయించి, చికిత్సకు అండగా ఉంటానని హామీ ఇచ్చాడు. యష్ చూపిన ఈ మానవత్వానికి, పెద్ద మనసుకు ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి.
‘డాన్ 3’ వివాదం రోజురోజుకు ముదురుతోంది. తనపై నిషేధం విధించిన FWICE సంస్థకు రణ్‌వీర్ సింగ్ లీగల్ నోటీసులు పంపాడు. దీనిపై FWICE చీఫ్ అడ్వైజర్ అశోక్ పండిట్ స్పందిస్తూ.. తమకు నోటీసులు అందినట్లు ధ్రువీకరించారు. ఈ వివాదంపై చర్చించేందుకు ఇవాళ సాయంత్రం ముంబైలో ప్రెస్‌మీట్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. దీంతో ఈ సమావేశంలో ఏం చెప్పబోతున్నారనేదానిపై తీవ్ర ఆసక్తి నెలకొంది.
నెట్‌ఫ్లిక్స్ యాక్షన్ బ్లాక్‌బస్టర్ ‘వార్ మెషిన్’ సీక్వెల్ అధికారికంగా ఖరారైంది. అలన్ రిచసన్ హీరోగా, పాట్రిక్ హ్యూస్ దర్శకత్వంలో వచ్చిన ఈ మిలట్రీ యాక్షన్ థ్రిల్లర్ OTTలో భారీ విజయం సాధించింది. ఈ మూవీ తమ ఆల్ టైం టాప్ 10 సినిమాల్లో ఒకటిగా నిలిచిందని, ప్రస్తుతం పార్ట్ 2 డెవలప్మెంట్ స్టేజ్‌లో ఉందని మేకర్స్ ప్రకటించారు. ఈ క్రేజీ మూవీ తెలుగులోనూ అందుబాటులో ఉంది.
వెంకటేష్ వరుస ముసిలతో బిజీగా ఉన్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘ఆదర్శ కుటుంబం’ పూర్తి చేస్తూనే.. అనిల్ రావిపూడి-కళ్యాణ్ రామ్‌తో మల్టీస్టారర్‌కు సిద్ధమవుతున్నాడు. ఇదిలా ఉంటే, ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ.. వెంకీ కోసం ఓ కథను సిద్ధం చేస్తున్నట్లు టాక్. ఇప్పటికే నిర్మాత సురేష్ బాబుతో చర్చలు జరిగాయట. పూర్తి స్క్రిప్ట్ అయ్యాక వెంకీకి వినిపించనున్నాడట.
కేవలం రూ.7.3 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన హాలీవుడ్ సైకలాజికల్ హారర్ చిత్రం ‘అబ్సెషన్’ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. విడుదలైన నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా $148 మిలియన్ల (దాదాపు రూ.1200 కోట్లు) వసూళ్లతో ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. మే 29న విడుదలైన ఈ చిత్రం భారతీయ మార్కెట్‌లోనూ పుంజుకుని, ఇప్పటివరకు రూ11.52 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో దూసుకుపోతోంది.
S.J సూర్య ‘కిల్లర్’ సినిమా సెట్‌లో ఘోర ప్రమాదం జరిగింది. చెన్నై బిన్నీ మిల్స్‌లో యాక్షన్ సీన్ల చిత్రీకరణ చేస్తుండగా గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో మదన్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, ముగ్గురికి తీవ్ర గాయాలు, మరో 10 మందికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు, ఫైర్ సిబ్బంది క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తున్న సింగర్ మంగ్లీకి మరో షాక్ తగిలింది. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు గూడ అంజయ్య రాసిన వీరత్వపు పాట “బండెనుక బండి గట్టి”ని మంగ్లీ పబ్బు స్టైల్లో, డ్యాన్స్ చేస్తూ పాడటంపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. పాటలోని పెయిన్, ఎమోషన్ దెబ్బతీసేలా ఆమె వేసిన గంతులపై తెలంగాణ సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తోంది.
రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో వస్తున్న భారీ మూవీ ‘పెద్ది’. జూన్ 4న విడుదల కానున్న ఈ సినిమా, జూన్ 3నే ఓవర్సీస్‌లో ప్రీమియర్స్‌తో సందడి చేయనుంది. అక్కడ అడ్వాన్స్ బుకింగ్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతుండటంతో, నార్త్ అమెరికాలో రిలీజ్‌కు ముందే వన్ మిలియన్ డాలర్ల మార్క్‌ను దాటి రికార్డు సృష్టించింది. ‘RRR’ తర్వాత ఈ ఘనత సాధించిన మూవీగా చరిత్ర లిఖించింది.
FWICE బ్యాన్ నేపథ్యంలో నటుడు రణ్‌వీర్ సింగ్‌కు నటి కంగనా రనౌత్ బహిరంగంగా మద్దతు ప్రకటించారు. ‘నీ స్థాయి పెరిగే కొద్దీ శత్రువుల సంఖ్య కూడా పెరుగుతుంది. రణవీర్ సింగ్.. నువ్వు ఇంకా పైకి ఎదగాలి, నీ శత్రువులకు అసూయ పుట్టించాలి. నువ్వు మరిన్ని విజయాలు సాధించడం నేను చూడాలనుకుంటున్నాను’ అంటూ కంగనా చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.