రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన హర్రర్ కామెడీ థ్రిల్లర్ ‘రాజాసాబ్’ ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి క్రేజీ న్యూస్ బయటకొచ్చింది. డిలీటెడ్ సన్నివేశాలను ఇవాళ లేదా రేపు ఈ మూవీలో యాడ్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ వార్త విన్న రెబల్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. అలాగే, పెంచిన టికెట్ ధరలను కోర్టు రద్దు చేయడంతో గతంలో ఉన్న ధరలకే టికెట్లు లభించనున్నాయి.
IBOMMA రవిని అరెస్ట్ చేసి పైరసీని అంతం చేశామని పోలీసులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా విడుదలైన ప్రభాస్ ‘రాజాసాబ్’ మూవీ HD ప్రింట్ ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమైంది. దీంతో ప్రభాస్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ మూవీ జనవరి 12న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో మరో సర్‌ప్రైజ్ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో సింగర్ రమణ గోగుల పాడిన పాట నేరుగా థియేటర్లలో కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమాలో నయనతార, వెంకటేష్ కీలక పాత్రలు పోషించారు.
మహేష్ బాబు సోదరుడు రమేష్ తనయుడు జయకృష్ణ హీరోగా నటిస్తోన్న మూవీ ‘శ్రీనివాస మంగాపురం’. తాజాగా ఈ సినిమా నుంచి జయకృష్ణ ఫస్ట్ లుక్‌ను మహేష్ రిలీజ్ చేశాడు. ఈ సందర్భంగా మహేష్.. జయకృష్ణకు, మేకర్స్‌కు బెస్ట్ విషెస్ చెప్పాడు. ఇక దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో బాలీవుడ్ నటి రాషా తడాని కథానాయికగా నటిస్తుండగా.. GV ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు.
కన్నడ స్టార్ యష్ హీరోగా దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తోన్న మూవీ ‘టాక్సిక్’. ఇటీవల రిలీజైన ఈ మూవీ గ్లింప్స్‌లో ఇంటిమేట్ సీన్స్ ఎక్కువగా ఉండటంపై విమర్శలు వచ్చాయి. తాజాగా వాటిపై దర్శకురాలు స్పందించింది. ‘మహిళా దర్శకురాలు ఇలాంటి సీన్స్ తెరకెక్కించిందంటూ వస్తోన్న విమర్శలు చూసి చిల్ అవుతున్నా’ అని పేర్కొంది. ఆ సీన్స్‌లో బీట్రీజ్ బాఖ్ నటించిందని తెలిపింది.
చిరంజీవి ‘మన శంకర వర ప్రసాద్ గారు’ జనవరి 12న విడుదల కానుంది. ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డు స్థాయి వసూళ్లు సాధిస్తోంది. ముఖ్యంగా USలో కేవలం ప్రీ-సేల్స్‌తోనే 500K డాలర్ల మార్క్‌ను దాటి, చిరూ కెరీర్‌లోనే ఫాస్టెస్ట్ రికార్డును నెలకొల్పింది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం మరిన్ని సంచలనాలు సృష్టించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందిన ‘రాజాసాబ్’ చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, ప్రభాస్ క్రేజ్‌తో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 90 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. భారత్‌లోనే రూ.54 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టినట్లు వెల్లడించాయి.
TG: కల్ట్ వెబ్ సిరీస్‌పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. మదనపల్లిలో జరిగిన యథార్థ ఘటన ఆధారంగా తెరకెక్కుతోన్న కల్ట్ వెబ్ సిరీస్ ఆపాలని పిటిషన్ దాఖలైంది. ఈ నేపథ్యంలో నటుడు రాహుల్ సిప్లిగంజ్, మెటా, ఫేస్‌బుక్, గూగుల్, కల్ట్ వెబ్‌సిరీస్ దర్శకుడు, బృందానికి కోర్టు నోటిసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
AP: మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రానికి టికెట్ ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. జనవరి 11న రాత్రి 8 గంటల ప్రీమియర్ షో టికెట్ ధరను GSTతో కలిపి రూ.500గా నిర్ణయించింది. అలాగే, జనవరి 12 నుంచి పది రోజుల పాటు సింగిల్ స్క్రీన్స్‌లో రూ. 100, మల్టీప్లెక్స్‌లలో రూ. 120 చొప్పున అదనంగా పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది.
‘రాజాసాబ్’ టికెట్ ధరల పెంపుపై ప్రభుత్వం జారీ చేసిన మెమోను తెలంగాణ హైకోర్టు రద్దు చేసిన నెంబర్ 120 ప్రకారం గరిష్ట టికెట్ ధర రూ.350కి మించడానికి వీల్లేదని కోర్టు స్పష్టం చేసింది. అయితే, ఈ తీర్పు కేవలం ఈ ఒక్క సినిమాకే కాకుండా, భవిష్యత్తులో విడుదల కానున్న అన్ని భారీ చిత్రాలకు వర్తిస్తుందని న్యాయస్థానం స్పష్టం చేసింది.
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’ చిత్ర నిర్మాతలకు భారీ షాక్ తగిలింది. ఈ చిత్ర టికెట్ ధరలను పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన మెమోను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. పాత ధరలకే టికెట్లను విక్రయించాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే, పెద్ద సినిమాల విడుదల సమయంలో పదేపదే టికెట్ రేట్లు ఎందుకు పెంచుతున్నారంటూ TG ప్రభుత్వంపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
దళపతి విజయ్ ‘జన నాయగన్’ సినిమాకు మరో భారీ షాక్ తగిలింది. ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ జారీ చేయాలంటూ సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలపై, తాజాగా డివిజన్ బెంచ్ స్టే విధించింది. దీంతో సినిమా విడుదల మరింత ఆలస్యం కానుంది. కాగా, విజయ్ కెరీర్‌లో చివరి చిత్రమైన ‘జన నాయగన్’ను కావాలనే అడ్డుకుంటున్నారని ఆయన అభిమానులు సెన్సార్ బోర్డ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
KGF స్టార్ యశ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘టాక్సిక్’. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే, తాజాగా విడుదలైన ఈ మూవీ టీజర్ రికార్డులు కొల్లగొడుతోంది. రిలీజైన 24 గంటల్లోనే 200 మిలియన్లకు పైగా వ్యూస్‌తో పాటు 5.5M లైక్స్‌ను సొంతం చేసుకుని యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది.
తమిళ స్టార్ హీరో కార్తీ ‘వా వాథియార్’ సినిమాకు మద్రాస్ హైకోర్టు షాక్ ఇచ్చింది. రూ.21 కోట్ల బకాయిల వివాదంలో ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో నిర్మాత జ్ఞానవేల్ రాజా బకాయిలు చెల్లించేందుకు.. సినిమా హక్కులను బహిరంగ వేలం వేయాలని ఆదేశించింది. ఫైనాన్షియర్‌కు పూర్తి బకాయిలు చెల్లించే వరకు సినిమా విడుదల చేయొద్దని కోర్టు స్పష్టం చేసింది.
98వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం మార్చి 15న జరగనుంది. తాజాగా అకాడమీ విడుదల చేసిన ‘రిమైండర్ లిస్ట్’లో భారత్ నుంచి 4 మూవీలు స్థానం దక్కించుకున్నాయి. ఉత్తమ చిత్రం కేటగిరీలో కాంతార 1, మహావతార్ నరసింహ, తన్వి ది గ్రేట్, టూరిస్ట్ ఫ్యామిలీ నిలిచాయి. మరోవైపు భారత్ నుంచి అధికారికంగా పంపించిన హోమ్‌బౌండ్ మూవీ ‘ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్’ కేటగిరీలో టాప్ 15లో నిలిచింది.