ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీ కాంబోలో ఓ మూవీ రాబోతుంది. తాజాగా ఈ సినిమా నుంచి నయా న్యూస్ బయటకొచ్చింది. ప్రస్తుతం ముంబైలో ఈ మూవీ సాంగ్ షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు బన్నీ చేసిన డ్యాన్స్‌కు అక్కడి వారు ఫిదా అయ్యారట. చప్పట్లు కొడుతూ బన్నీని అభినందించినట్లు టాక్ వినిపిస్తుంది.
ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఫొటో.. హిస్టరీ క్రియేట్ చేసింది. రామ్ షేర్ చేసిన ఫొటోకు 7.6 మిలియన్లకుపైగా లైక్స్ వచ్చాయి. ఈ ఫీట్ తెలుగులో స్టార్ హీరోల పోస్టులకు వచ్చిన లైక్స్ కంటే అధికమని సినీ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, రామ్ ప్రస్తుతం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ మూవీతో బిజీగా ఉన్నారు.
తన ప్రేయసి, హీరోయిన్ సాయి ధన్షికతో తమిళ స్టార్ హీరో విశాల్ నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని తెలుపుతూ విశాల్ పోస్ట్ పెట్టారు. ‘నాకు బర్త్ డే విషెస్ చెప్పిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. కుటుంబసభ్యులు, బంధువుల సమక్షంలో సాయి ధన్షికతో నా ఎంగేజ్మెంట్ జరిగింది. మీ అందరి ఆశీర్వాదాలు ఎప్పటిలాగే మాపై ఉండాలని కోరుకుంటున్నా’ అని పేర్కొన్నారు. ఈ మేరకు ఫొటోలు షేర్ చేశారు.
రజినీకాంత్ ‘శివాజీ’ సినిమాను సత్యరాజ్ తిరస్కరించడం కాంట్రవర్సీకి దారి తీసింది. రజినీ మూవీల్లో తాను నటించనని ఆయన చెప్పినట్లు వార్తలొచ్చాయి. వీటిపై సత్యరాజ్ స్పందించారు. ‘శివాజీ సమయంలో నేను హీరోగా కొన్ని సినిమాలు చేస్తున్నా. మళ్లీ విలన్‌గా చేస్తే ఇక అన్నీ అలాంటి పాత్రలే వస్తాయని ఆ మూవీని రిజెక్ట్ చేశాను. కానీ అప్పటికే పలు వార్తలు వచ్చాయి. వాటిల్లో నిజం లేదు’ అని తెలిప...
సీనియర్ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి 43వ మూవీగా ‘వేదవ్యాస్’ రాబోతుంది. సాయి ప్రగతి ఫిల్మ్స్ బ్యానర్‌పై జనగామ DCC అధ్యక్షుడు, మాజీ MLA కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇందులో దక్షిణ కొరియా నటి జున్ హ్యున్ జి కథానాయిక నటిస్తుంది. HYD అన్నపూర్ణ స్టూడియోస్‌లో నిర్మాత దిల్ రాజు, వివి వినాయక్, అనిల్ రావిపూడి చేతుల మీదుగా ఈ మూవీ ఘనంగా ప్రారంభమైంది.
‘బలగం’ దర్శకుడు వేణు యెల్దండి.. నితిన్ హీరోగా ‘ఎల్లమ్మ’ సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ మూవీలో హీరోగా తమిళ స్టార్ కార్తీని తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ బడ్జెట్ రూ.70 కోట్లు కావడంతో మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని తమిళ, తెలుగు భాషల్లో క్రేజ్ ఉన్న కార్తీని తీసుకోవాలని నిర్మాత దిల్ రాజు భావిస్తున్నారట. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.
టాలీవుడ్‌లో నటించకపోవడంపై ప్రముఖ నటి కమలినీ ముఖర్జీ మాట్లాడారు. ఓ సినిమాలో తాను పోషించిన పాత్ర ఊహించినంత స్థాయిలో తెరకెక్కలేదని అన్నారు. ఆ పాత్రపై అసంతృప్తి కలిగిందని తెలిపారు. ఆ విషయంలో ఫీలయ్యానని, అందుకే తెలుగు సినిమాలు చేయడం లేదని పేర్కొన్నారు. ఇక తెలుగులో కమలినీ.. ‘ఆనంద్’, ‘గోదావరి’, ‘గమ్యం’ తదితర సినిమాల్లో నటించారు.
TG: ప్రముఖ యాంకర్, బిగ్ బాస్ తెలుగు కంటెస్టెంట్ లోబోకు జైలు శిక్ష పడింది. ఏడేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో లోబోకు జనగామ కోర్టు.. ఏడాది జైలు శిక్షతో పాటు రూ.12,500 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. జనగామ జిల్లాలో 2018 మే 21న లోబో కారు ఆటోను ఢీకొట్టగా.. ఇద్దరు చనిపోయారు. దీంతో మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు లోబోపై పోలీసులు కేసు నమోదు చేశారు.
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో రాబోతున్న మూవీ ‘అఖండ 2’. సెప్టెంబర్ 25న రిలీజ్ కానున్న ఈ సినిమా వాయిదా పడింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. పోస్ట్ ప్రొడక్షన్స్ పనులకు అధిక సమయం పడుతుండటంతో ఈ మూవీని వాయిదా వేస్తున్నట్లు నోట్ విడుదల చేశారు. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తామని వెల్లడించారు.
‘మిరాయ్’ మూవీ వెనుక ఎన్నో కళలు ఉన్నాయని మంచు మనోజ్ తెలిపారు. ఈ సినిమాలో ఛాన్స్ రావడం తనకు దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నట్లు చెప్పారు. తన కెరీర్‌లో ఇలాంటి పాత్ర ఇప్పటివరకూ చేయలేదని, ఈ అవకాశం ఇచ్చినందుకు చిత్ర బృందానికి థ్యాంక్స్ చెబుతున్నానని పేర్కొన్నారు. అలాగే అశోకుడు రాసిన 9 పుస్తకాల గురించి ప్రపంచానికి చెప్పాలనే ఉద్దేశంతో ఈ మూవీని తెరకెక్కించారని వెల్లడించారు.
ప్రముఖ రియాలిటీ షో ‘బిగ్‌బాస్-9’ గ్రాండ్ లాంచ్ డేట్ వచ్చేసింది. సెప్టెంబర్ 7న ఈ షో ప్రారంభం కాబోతుంది. ఈ సీజన్‌కు కూడా కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించబోతున్నాడు. ఈసారి సెలబ్రిటీలతో పాటు సామాన్యులకు కూడా అవకాశం కల్పిస్తున్నారు. ఇందుకోసం ‘అగ్నిపరీక్ష’ పేరుతో షో కండక్ట్ చేసి ఐదుగురు సామాన్య ప్రజలను ఎంపిక చేస్తున్నారు.
స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి నటించిన ‘ఘాటీ’ మూవీ సెప్టెంబర్ 5న విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ సెన్సార్ పనులు పూర్తయినట్లు తెలుస్తోంది. దీనికి సెన్సార్ సభ్యులు U/A సర్టిఫికెట్ జారీ చేశారట. ఇక ఈ చిత్రం 2:35 గంటల నిడివితో థియేటర్లలోకి రాబోతున్నట్లు సమాచారం. అంతేకాదు ఈ సినిమా ఫస్టాఫ్ ఎమోషనల్ జర్నీతో.. సెకండాఫ్ పవర్ ఫుల్ యాక్షన్‌తో కొనసాగనున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి.
అక్కినేని నాగచైతన్య హీరోగా దర్శకుడు కార్తీక్ దండు మైథలాజికల్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ‘NC 24’ వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ మూవీలో బాలీవుడ్ నటుడు స్పర్శ్ శ్రీవాస్తవ కీలక పాత్రలో కనిపించనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్ షేర్ చేశారు. ఇక ‘లాపతా లేడీస్’లో స్పర్శ్ దీపక్ కుమార్‌గా అలరించారు.
తమిళ హీరో విశాల్, దర్శకుడు రవి అరసు కాంబోలో తెరకెక్కుతోన్న సినిమా మగుడం’. తెలుగులో ‘మకుటం’ పేరుతో విడుదల కానుంది. ఈ మూవీ నుంచి రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్‌లో విశాల్ మూడు విభిన్న గెటప్‌లో కనిపించి సినిమాపై క్యూరియాసిటీ పెంచేశారు. ఇక ఈ సినిమాలో అంజలి, దుషార విజయన్ కీలక పాత్రల్లో నటిస్తుండగా.. GV ప్రకాష్ మ్యూజిక్ అందిస్తున్నారు.
మలయాళ నటి లక్ష్మి మీనన్‌కు కేరళ కోర్టులో ఊరట లభించింది. IT ఉద్యోగినిపై దాడి కేసులో లక్ష్మితో పాటు తన ముగ్గురు ఫ్రెండ్స్‌పై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం నటి కోర్టును ఆశ్రయించారు. దీంతో న్యాయస్థానం సెప్టెంబర్ 17 వరకు ఆమెను అరెస్ట్ చేయకండి అని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆమె ఫ్రెండ్స్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.