టాలీవుడ్ హీరో నితిన్, శ్రీలీల జంటగా నటించిన ‘రాబిన్‌హుడ్’ మూవీ మార్చిలో రిలీజై పరాజయం పొందింది. తాజాగా ఈ సినిమా OTTపై నయా అప్‌డేట్ వచ్చింది. దీని డిజిటల్ రైట్స్‌ను ‘జీ5’ సొంతం చేసుకోగా.. ఈ నెల 10 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే ‘సంక్రాంతికి వస్తున్నాం’ తరహాలో ఒకే రోజు టీవీతో పాటు OTTలో ఇది రిలీజ్ కానున్నట్లు సమాచారం.
2023 సంవత్సరానికి గానూ ‘ఒసాకా తమిళ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’ విజేతల జాబితా విడుదలైంది. ఇందులో భాగంగా నటుడు అజిత్‌కు ‘తునివు’ చిత్రంలోని నటనకు ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడు. అలాగే, నటి త్రిష ‘లియో’ సినిమాలోని నటనకు ఉత్తమ నటిగా అవార్డును గెలుచుకుంది. దీంతో అజిత్, త్రిషకు అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిపై బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ స్పందించాడు. ఆ దాడిని తీవ్రంగా ఖండించాడు. ఈ ఉగ్రదాడి విషయంలో కశ్మీర్ వాసులు ఎంతో బాధపడుతున్నారన్నాడు. ప్రభుత్వం కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటుందని పూర్తి నమ్మకం ఉందని పేర్కొన్నాడు. కాగా, ఈ ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు చనిపోయిన విషయం తెలిసిందే.
భోజ్‌పురి సింగర్ నేహాసింగ్ రాథోడ్‌పై కేసు నమోదైంది. పహల్గామ్ కాల్పుల ఘటనను రాబోయే బీహార్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ వాడుకుంటారని ‘X’లో వచ్చిన పోస్టును రీట్వీట్ చేసింది. దీంతో ఆమెపై లక్నోలో కేసు నమోదైంది. ఈ పోస్ట్ దేశద్రోహానికి సమానమని, పాక్ మీడియాలో వైరల్ అవుతోందని పోలీసులు FIRలో పేర్కొన్నారు. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
నాగ చైతన్య హీరోగా కార్తీక్ దండు దర్శకత్వంలో మైథలాజికల్ థ్రిల్లర్ సినిమా తెరకెక్కుతుంది. ‘NC-24’ వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ మూవీ నుంచి ఇవాళ సాయంత్రం 4:05 గంటలకు అప్‌డేట్ రాబోతుంది. ఈ మేరకు మేకర్స్ పోస్టర్ షేర్ చేశారు. దీంతో ఈ మూవీ టైటిల్‌ను ప్రకటిస్తారేమోనని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
పాకిస్తాన్ నటుడు ఫవాద్‌ఖాన్‌కు నటి దియా మీర్జా మద్దతు ఇవ్వడంతో విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై ఆమె స్పందించింది. అవి గతంలో చేసిన వ్యాఖ్యలని సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. ఏప్రిల్ 10న ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాను ఫవాద్ గురించి మాట్లాడినట్లు తెలిపింది. ఉగ్రదాడికి ముందు చేసిన ఆ వ్యాఖ్యాలను ఇప్పుడు చేసినట్టు చూపించొద్దని ఆమె విజ్ఞప్తి చేసింది.
నాని హీరోగా శైలేష్ కొలను తెరకెక్కించిన ‘హిట్ 3’ సినిమా మే 1న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా సెన్సార్ పూర్తయింది. ‘ఎ’ సర్టిఫికెట్ జారీ చేసిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ కొన్ని మార్పులు చేయాలని చిత్ర బృందానికి సూచించింది. ఈ సినిమా రన్‌టైమ్ 2:37 గంటలు ఉంది. కాగా, ఈ మేరకు వాటిలో మార్పు, చేర్పులు చేసి చిత్ర బృందం తుది కాపీని సమర్పించింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కిన ‘పుష్ప 2’ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. OTTలో సందడి చేస్తోన్న ఈ సినిమా.. ఇటీవల స్టార్ మా ఛానల్‌లో టెలికాస్ట్ అయింది. తాజాగా దీని TRP వచ్చేసింది. ఈ సినిమాకు 12.61 రేటింగ్ నమోదైంది. కాగా, గతంలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ జీ తెలుగులో టెలికాస్ట్ కాగా.. 15.92 TRP వచ్చింది.
పహల్గామ్ ఉగ్రదాడికి వ్యతిరేకంగా పాక్‌పై భారత్ కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఈ క్రమంలో భారత్‌లో పాక్ సినిమాలు, నటులపై నిషేధం విధించింది. ఆ దేశ సినిమాలను ఇండియాలో విడుదల చేయకూడదని కేంద్ర సమాచార శాఖ నిర్ణయించింది. ఈ ప్రభావం ఫవాద్ ఖాన్ నటించిన ‘అబిర్ గులాల్’ సినిమాపై పడనుంది. అబిర్ గులాల్ సినిమా మే 9న విడుదల కావాల్సి ఉంది.
బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. దర్శకుడు పా. రంజిత్ తెరకెక్కించనున్న వెబ్ సిరీస్‌లో ఆమె ప్రధాన పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. మహిళా ప్రాధాన్య కథతో తెరకెక్కనున్న ఈ సిరీస్ షూటింగ్.. జూలైలో స్టార్ట్ కానున్నట్లు సమాచారం. ఇందులో మహిళల అణచివేత, సామాజిక సమస్యలే ప్రధాన కథాంశంగా ఉండనున్నాయట.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కిన ‘కల్కి’ సినిమాకు సీక్వెల్‌గా ‘కల్కి 2’ రాబోతుంది. తాజాగా ఈ సినిమా రిలీజ్‌పై నాగ్ అశ్విన్ మాట్లాడాడు. ‘కల్కిని 3,4 గ్రహాలు ఒకే వరుసలో ఉన్నప్పుడు రిలీజ్ చేశాను. దాని సీక్వెల్‌ను 7,8 గ్రహాలు ఒకే వరుసలోకి వచ్చినప్పుడు విడుదల చేస్తా’ అని ఓ ఈవెంట్‌లో చెప్పాడు.
సినీ నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ ‘X’ ఖాతా హ్యాక్ అయింది. ఈ క్రమంలో ఆమె ఇన్‌స్టా వేదికగా పోస్టు పెట్టారు. తన అకౌంట్ హ్యాక్ అయిందని, హ్యాకర్ల నుంచి మెసేజ్ వచ్చిందని చెప్పారు. గడిచిన కొన్ని గంటల్లో తన పేజీలో ఎలాంటి పోస్టు అయినా, ఏ మెసేజ్ తనది కాదన్నారు. సమస్యను పరిష్కరించే వరకు ఇన్‌స్టా వేదికగా అందుబాటులో ఉంటానని చెప్పారు.
స్టార్ హీరోయిన్ సమంత, వరుణ్ ధావన్ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘సిటాడెల్: హనీ బన్నీ’. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సిరీస్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే దీనికి కొనసాగింపుగా రాబోతున్న పార్ట్ 2ను రద్దు చేసినట్లు అమెజాన్ ప్రైమ్ తెలిపింది. ఈ భాగాన్ని కూడా పార్ట్ 1లో యాడ్ చేయనున్నట్లు పేర్కొంది.
నటుడు ప్రియదర్శి హీరోగా దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కించిన సినిమా ‘సారంగపాణి జాతకం’. ఈ నెల 25న రిలీజ్ కానుంది. తాజాగా ఈ మూవీ సెన్సార్ పనులు పూర్తయినట్లు తెలుస్తోంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ జారీ చేసినట్లు తెలుస్తోంది. అలాగే పలు చోట్ల కొన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్‌కు మ్యూట్స్ సూచించినట్లు సమాచారం.
ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘ఛావా’ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే సదరు సంస్థలో హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉన్న ఈ చిత్రం తెలుగు వెర్షన్ తాజాగా రిలీజ్ అయింది. ఇక విక్కీ కౌశల్, రష్మికా మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది.