• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »సినిమా

ప్రభాస్ ‘రాజాసాబ్’ షూటింగ్‌కు బ్రేక్!

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘రాజాసాబ్’ మూవీ షూటింగ్‌కు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. ఈ మూవీ షూటింగ్‌లో తాము పాల్గొనబోమని ఫెడరేషన్ సభ్యులు చెబుతున్నారట. సమ్మె సమయంలో ఈ మూవీ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ లీగల్ నోటిసులు పంపించడం ఇందుకు కారణమట. అయితే తాము నోటీసులు వెనక్కి తీసుకుంటామని మేకర్స్ చెప్పినా.. సినీ వర్కర్స్ ఒప్పుకోవడం లేదట.

August 24, 2025 / 12:38 PM IST

‘మాస్ జాతర’ కొత్త రిలీజ్ డేట్ ఇదేనా?

మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు భాను బోగవరపు కాంబోలో ‘మాస్ జాతర’ మూవీ రాబోతుంది. అయితే ఈ నెల 27న రిలీజ్ కావాల్సిన ఈ సినిమాను సెప్టెంబర్ 12న పోస్ట్ పోన్ చేసినట్లు వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రోజు ఈ చిత్రం విడుదల అయ్యే ఛాన్స్ లేదట. కొన్ని అనివార్య కారణాల వల్ల అక్టోబర్‌లో దీపావళి కానుకగా విడుదల కానున్నట్లు టాక్ వినిపిస్తుంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

August 24, 2025 / 11:09 AM IST

కొత్త సినిమాను ప్రకటించిన తేజ సజ్జా

‘మిరాయ్’ సినిమాతో బిజీగా ఉన్న తేజ సజ్జా మరో కొత్త ప్రాజెక్టును అనౌన్స్ చేశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి పవర్‌ఫుల్ సినిమాను చేయనున్నారు. ‘తేజ సజ్జా X2 PMF’ అనే ట్యాగ్‌తో సాలిడ్ పోస్టర్ షేర్ చేశారు. ఈ మూవీ కథ రాయలసీమ నుంచి యావత్ ప్రపంచానికి చేరబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. 2027 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కానున్నట్లు చెప్పారు.

August 24, 2025 / 10:36 AM IST

వాటికి బిన్నంగా ‘దృశ్యం 3’: దర్శకుడు

‘దృశ్యం’, ‘దృశ్యం 2’కి బిన్నంగా ‘దృశ్యం 3’ని తెరకెక్కిస్తున్నట్లు మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్ తెలిపారు. ‘దృశ్యం 4’ ఉంటుందో.. లేదో ఇప్పుడే చెప్పలేమని పేర్కొన్నారు. అంతేకాదు సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇంకా చాలు అనిపంచిందని, తదుపరి సినిమాలు కొత్తగా ప్రయత్నిస్తున్నామని చెప్పారు. అవి ఫెయిల్ అయినా.. ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇచ్చామనే తృప్తి ఉంటుందన్నారు.

August 24, 2025 / 10:15 AM IST

అక్కడ ‘OG’ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘OG’ సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా 2:35 గంటల నిడివితో థియేటర్లలోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు అమెరికాలో ఈ నెల 29 నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని అక్కడి డిస్ట్రిబ్యూషన్ సంస్థ ప్రత్యంగిరా సినిమాస్ తెలిపింది. సెప్టెంబర్ 24న ప్రీమియర్ షోలు ఉంటాయని పేర్కొంది.

August 24, 2025 / 10:00 AM IST

క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో సామ్ మూవీ?

స్టార్ హీరోయిన్ సమంత కథానాయికగా ‘మా ఇంటి బంగారం’ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ వచ్చింది. నందిని రెడ్డి తెరకెక్కించనున్న ఈ సినిమా 1980ల నేపథ్యంలో సాగే క్రైమ్ థ్రిల్లర్ కథతో తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఇందులో సామ్ పాత్ర యాక్షన్ కోణంలో సాగనున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కానున్నట్లు టాక్ వినిపిస్తుంది.

August 24, 2025 / 09:31 AM IST

మరోసారి పోలీస్‌గా సూర్య?

తమిళ హీరో సూర్య, మలయాళ దర్శకుడు జీతూ మాధవన్ కాంబోలో సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో సూర్య మరోసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తుంది. 2D ఎంటర్‌‌టైన్‌మెంట్ సంస్థ ఈ మూవీని నిర్మించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ చిత్రం ఈ ఏడాది చివరిలో సెట్స్ మీదకు వెళ్లనుందట.

August 24, 2025 / 09:18 AM IST

గుడ్ న్యూస్ చెప్పిన టాలీవుడ్ కమెడియన్

టాలీవుడ్ కమెడియన్ మహేష్ విట్టా గుడ్ న్యూస్ చెప్పారు. తాను తండ్రి అయినట్లు తెలిపారు. తన భార్య మగబిడ్డకు జన్మనిచ్చిందని చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఫొటోను షేర్ చేశారు. దీంతో వారికి నెటిజన్లు కంగ్రాట్స్ చెబుతున్నారు. కాగా, మహేష్.. శ్రావణి రెడ్డి అనే అమ్మాయిని ఐదేళ్లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

August 23, 2025 / 04:40 PM IST

OTTలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘మయసభ’

ఆది పినిశెట్టి, చైతన్యరావు ప్రధాన పాత్రల్లో నటించిన పొలిటికల్ డ్రామా ‘మయసభ’. సోనీలివ్‌లో ఈ ఈ సిరీస్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇండియాలోనే టాప్ 5 షోస్‌లో ఈ సిరీస్ ఒకటిగా నిలిచింది. ఈ ఫీట్‌ను అందుకున్న మొదటి తెలుగు సిరీస్‌గా ఈ మూవీ నిలిచినట్లు మేకర్స్ తెలిపారు. ఇక ప్రాణ స్నేహితులైన ఇద్దరు రాజకీయ వ్యక్తుల కల్పిత కథతో దీన్ని దేవ కట్టా తెరకెక్కించారు.

August 23, 2025 / 03:26 PM IST

‘రాజాసాబ్’పై నయా అప్‌డేట్

రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు మారుతి కాంబోలో ‘రాజాసాబ్’ మూవీ రాబోతుంది. ఈ సినిమాలో మొత్తం 5 పాటలు ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ ఇంట్రడక్షన్ సాంగ్‌తో పాటు మెలోడీ రొమాంటిక్ సాంగ్, హీరోయిన్స్‌తో మాస్ సాంగ్, మాళవిక మోహన్‌తో మరో మాస్ సాంగ్, థీమ్ సాంగ్ కూడా ఉంటాయట. ఇక ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

August 23, 2025 / 03:00 PM IST

సెట్స్ మీదకు ‘దేవర 2’.. ఎప్పుడంటే?

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన ‘దేవర’ మూవీ మంచి హిట్ అందుకుంది. దీనికి సీక్వెల్‌గా ‘దేవర 2’ రాబోతుంది. ఈ మూవీ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. ఈ ఏడాది చివరిలో ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి అనిరుధ్‌తో మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా పూర్తయినట్లు సమాచారం.

August 23, 2025 / 12:07 PM IST

సన్నీ లియోన్‌ను బీట్ చేయనున్న తమన్నా?

కెరీర్‌లో కొత్త అడుగులు వేస్తున్న తమన్నా ‘రాగిణి MMS 3’లో నటించబోతోందని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ‘జైలర్’లో ఐటమ్ సాంగ్, ‘లస్ట్ స్టోరీస్ 2’లో బోల్డ్ పాత్ర తర్వాత ఈ ప్రాజెక్ట్‌ కోసం ఏక్తా కపూర్‌తో ఆమె చర్చలు జరిపిందట. త్వరలో డీల్ ఖరారయ్యే అవకాశం ఉందని టాక్. ‘రాగిణి MMS 2’లో సన్నీ లియోన్ సృష్టించిన ప్రభావాన్ని తమన్నా మించిపోతుందా లేద...

August 23, 2025 / 12:00 PM IST

ప్రముఖ నటుడి విడాకుల వార్తలు.. క్లారిటీ

బాలీవుడ్ నటుడు గోవిందా, ఆయన సతీమణి సునీతా అహుజా విడాకులు తీసుకుంటున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ వార్తలను సునీత ఖండించగా.. తాజాగా లాయర్ లలిత్ బింద్రా ఈ అంశంపై స్పందించారు. నటుడి విడాకులకు సంబంధించి ఎలాంటి కేసులు లేవని చెప్పారు. వారిద్దరి మధ్య సమస్యలేమి లేవని, కావాలనే పాత విషయాలను తెరపైకి తీసుకొస్తున్నారని తెలిపారు. గణేష్ చతుర్థికి వారిని జంటగా చూస్తారన్నారు.

August 23, 2025 / 11:33 AM IST

‘SSMB 29’ షూటింగ్‌పై నయా UPDATE

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు రాజమౌళి కాంబోలో భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కుతోంది. ‘SSMB 29’ వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం సౌత్ ఆఫ్రికాలో జరుగుతున్నట్లు తెలుస్తోంది. అక్కడ ఒక పాటతో పాటు ఫైట్ సీక్వెన్‌ను షూట్ చేయనున్నారట. దట్టమైన అడవుల్లో క్రూర మృగాల మధ్య ఒక ఛేజ్ సీన్‌ను చిత్రీకరించనున్నట్లు సమాచారం.

August 23, 2025 / 11:21 AM IST

విశాల్ కొత్త సినిమాలో అంజలి

తమిళ హీరో విశాల్, దర్శకుడు రవి అరసు కాంబోలో మూవీ తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమాలో నటి అంజలి కీలక పాత్ర పోషిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఆమె షూటింగ్‌లో జాయిన్ అయినట్లు తెలిపారు. ఈ మేరకు పోస్టర్ షేర్ చేశారు. ఇక ఈ సినిమాలో దుషార విజయన్ కథనాయికగా నటిస్తుండగా.. GV ప్రకాష్ మ్యూజిక్ అందిస్తున్నారు.

August 23, 2025 / 10:59 AM IST