• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »సినిమా

మలయాళ నటిపై దర్శకుడు ఆసక్తికర వ్యాఖ్యలు

మలయాళ నటి కళ్యాణి ప్రియదర్శన్ గురించి తన తండ్రి, దర్శకుడు ప్రియదర్శన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘కళ్యాణి సినిమాల్లోకి వస్తుందని మేం ఎప్పుడూ అనుకోలేదు. ఆర్కిటెక్ట్ కావాలన్నది తన డ్రీమ్. ఓ రోజు నాగార్జున కాల్ చేసి ‘హలో!’ మూవీలో హీరోయిన్‌గా మీ అమ్మాయిని అనుకుంటున్నామన్నారు. కానీ కళ్యాణికి నటన రాదని చెప్పా. కానీ ఒకసారి ప్రయత్నిస్తా నాన్న అని ముందడుగు వేసింది’ అని అన్నాడు.

March 15, 2026 / 07:27 PM IST

ఫ్రీగా చేసినా కోట్లు వస్తున్నాయి: అనిల్ కపూర్

స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాపై నటుడు అనిల్ కపూర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆ సినిమాను ఉచితంగా చేసినప్పటికీ, పారితోషికానికి సంబంధించిన చెక్కులు వస్తున్నాయని తెలిపాడు. తాజాగా రూ.3.6 లక్షల చెక్కు వచ్చిందని, ఇప్పటివరకు దాదాపు అర మిలియన్ పౌండ్లు అందుకున్నానని వెల్లడించాడు. ఆనాడు నిర్మాతలు డబ్బులు ఇవ్వలేమన్నా.. సినిమాపై ఉన్న ఇష్టంతో అతడు రెమ్యూనరేషన్ తీసుకోకుండా నటించడం విశేషం.

March 15, 2026 / 06:34 PM IST

సుడిగాలి సుధీర్ ‘G.O.A.T’ సెన్సార్ పూర్తి

బుల్లితెర సెన్సేషన్ సుడిగాలి సుధీర్, దివ్యభారతి ప్రధాన పాత్రల్లో ‘G.O.A.T’ (Greatest Of All Times) మూవీ రాబోతుంది. ఈ చిత్రం 2026, మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు పూర్తయ్యాయి. ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు U/A సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ విషయాన్ని తెలుపుతూ మేకర్స్ పోస్టర్ షేర్ చేశారు. ఇక ఈ మూవీని దర్శకుడు వేదవ్యాస్ ఆకుల రూపొందించాడు.

March 15, 2026 / 05:10 PM IST

TVలోకి రవితేజ సంక్రాంతి సినిమా!

మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు కిషోర్ తిరుమల కాంబోలో తెరకెక్కిన మూవీ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. సంక్రాంతి కానుకగా రిలీజైన ఈ సినిమా జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ మూవీ TVలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఛానల్ జీ తెలుగులో మార్చి 22న సాయంత్రం 6 గంటలకు ఈ చిత్రం టెలికాస్ట్ కానుంది. మరి బుల్లితెరపై ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.

March 15, 2026 / 04:56 PM IST

‘ధురంధర్ 2’ క్లైమాక్స్‌లో భారీ ట్విస్ట్..!

బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్, దర్శకుడు ఆదిత్య ధర్ కాంబోలో తెరకెక్కిన ‘ధురంధర్ 2’ మూవీ మార్చి 19న రిలీజ్ కానుంది. ఈ సినిమా ముగింపులో భారీ క్లైమాక్స్ ట్విస్ట్‌ను దర్శకుడు ప్లాన్ చేసినట్లు టాక్ నడుస్తోంది. కేవలం ట్విస్ట్‌తోనే సరిపెట్టకుండా.. సినిమా చివరిలో ‘ధురంధర్ 3’ని ప్రకటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

March 15, 2026 / 04:26 PM IST

భారత్‌లో ఆస్కార్ 2026 వేడుక ఎప్పుడు చూడొచ్చంటే?

నేడు లాస్ ఏంజిల్స్‌లో 98వ ఆస్కార్ వేడుకలు జరగనున్నాయి. భారత్‌లో మార్చి 16న తెల్లవారుజామున 3:30 గంటల నుంచి రెడ్ కార్పెట్, 4:30 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుంది. జియో హాట్‌స్టార్ ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని చూడొచ్చు. స్టార్ మూవీస్, స్టార్ మూవీస్ సెలెక్ట్, కలర్స్ ఇన్ఫినిటీ  ఛానళ్లలో లైవ్ టెలికాస్ట్ అవుతుంది. అదే రోజు 9:00PMకు రీ టెలికాస్ట్ అవుతుంది.

March 15, 2026 / 04:16 PM IST

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్‌పై రామ్ చరణ్ పోస్ట్

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ టెర్రిఫిక్‌గా ఉందంటూ రామ్ చరణ్ ట్వీట్ చేశాడు. ‘ఆద్యంతం అద్భుతమైన ఉత్సాహం కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ చాలా అద్భుతంగా, పూర్తి స్వాగ్‌తో కనిపిస్తున్నారు. హరీష్ శంకర్ ఆయన్ని ఎలా ప్రజెంట్ చేయాలో కచ్చితంగా తెలిసిన వ్యక్తి. ‘ఉస్తాద్’తో ఉగాది పండుగను జరుపుకోవడానికి ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. చిత్రబృందానికి నా శుభాకాంక్షలు’ అంటూ ...

March 15, 2026 / 04:06 PM IST

దర్శకుడి ప్రవర్తన నచ్చక సినిమా వదిలేశా: లావణ్య

తన సినీ కెరీర్‌లోని ఒక చేదు అనుభవాన్ని నటి లావణ్య త్రిపాఠి పంచుకుంది. కరోనా సమయంలో ఒక తమిళ సినిమాకు సంతకం చేశానని, అయితే షూటింగ్ సెట్‌లో దర్శకుడి ప్రవర్తన అస్సలు నచ్చలేదని ఆమె తెలిపింది. అక్కడ తనకు భద్రత లేదని, తీవ్ర అసౌకర్యంగా అనిపించడంతో ఆ ప్రాజెక్ట్ నుంచి తక్షణమే తప్పుకున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం ఈ కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి.

March 15, 2026 / 03:50 PM IST

పవన్ ట్వీట్‌పై చిన్మయి విమర్శలు

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్‌పై సింగర్ చిన్మయి విమర్శలు చేసింది. జ్ఞానపీఠ్ పురస్కారానికి ఎంపికైన వైరముత్తును అభినందిస్తూ పవన్ ట్వీట్ చేశారు. దీంతో మహిళల్ని లైంగికంగా వేధించిన ఆ కవి గురించి పవన్‌కి ఏమీ తెలిసి ఉండకపోవచ్చంటూ ట్వీట్ చేసింది. ఇంతమంది రాజకీయ నాయకులు ఓ సినిమా పాటల రచయితకు శుభాకాంక్షలు చెప్పాల్సిన అవసరం ఏంటో అర్థం కావట్లేదంటూ విమర్శించింది.

March 15, 2026 / 03:48 PM IST

బాలీవుడ్‌లో మరో క్రేజీ ప్రాజెక్టులో సాయిపల్లవి?

సాయిపల్లవి బాలీవుడ్ లెజెండరీ నటి మధుబాల బయోపిక్‌లో నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం ఆమెను సంప్రదించినట్లు టాక్. ఇప్పటికే కియారా అద్వానీ, అనీత్ పడ్డా పేర్లు వినిపించినా, తాజా అప్‌డేట్‌తో అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఆమె తొలి హిందీ చిత్రం ‘ఏక్ దిన్’ మే 2026లో విడుదల కాకముందే ఈ భారీ ఆఫర్ రావడం విశేషం.

March 15, 2026 / 03:15 PM IST

ఎన్టీఆర్ వాచీల ఖరీదు రూ. 13కోట్లు!

జూ. ఎన్టీఆర్ విలాసవంతమైన వాచీల సేకరణ హాట్ టాపిక్‌గా మారింది. రిచర్డ్ మిల్, పాటెక్ ఫిలిప్, రోలెక్స్ వంటి ప్రపంచ ప్రఖ్యాత బ్రాండ్ల స్పెషల్ ఎడిషన్లు ఆయన వద్ద ఉన్నాయట. ఒక్కో వాచ్ ధర రూ. 2 కోట్ల పైమాటే కాగా, ఒక వాచ్ ఏకంగా రూ. 6 కోట్లు ఉంటుందట. మొత్తంగా ఆయన వాచ్ కలెక్షన్ విలువ రూ. 13 కోట్లు దాటుతుందట. క్వాలిటీ, డిజైన్ పట్ల NTR చూపే శ్రద్ధ ఆయన రాయల్ టేస్ట్‌కు […]

March 15, 2026 / 02:54 PM IST

సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు: అల్లు అర్జున్

ఇటీవల వివాహం చేసుకున్న నటుడు అల్లుశిరీష్ దంపతులను ఏపీ సీఎం చంద్రబాబు ఆశీర్వదించిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పందించాడు. ‘మీరు మా ఇంటికి వచ్చిన సమయంలో నేను లేను. క్షమించండి.. నేను విదేశాల్లో ఉన్నాను. కానీ మీతో ఫోన్‌లో మాట్లాడటం నాకు సంతోషంగా ఉంది. కొత్త జంటకు మీ ఆప్యాయత, ఆశీర్వాదాలకు మేము నిజంగా కృతజ్ఞులం’ అని ‘X’లో రాసుకొచ్చారు.

March 15, 2026 / 02:43 PM IST

అప్పట్లో ఆయనతో వర్క్‌ వద్దనేదానిని: దర్శకురాలు

నటుడు అక్షయ్‌ ఖన్నాతో పనిచేయడంపై దర్శకురాలు ఫరా ఖాన్‌ ఆసక్తికర విషయాలు పంచుకుంది. 90వ దశకంలో ఆయన జుట్టు రాలడం వల్ల కలిగిన అసహనాన్ని సెట్స్‌లో చూపించేవారని, అందుకే ఆయనతో పనిచేయడానికి తాను భయపడేదానినని తెలిపింది. ఆ సమస్యను ఆయన మానసికంగా అంగీకరించాక చాలా ప్రశాంతంగా మారారని, ప్రస్తుతం ఆయనకు ఆర్భాటాలు నచ్చవని, కేవలం పనిని మాత్రమే ప్రేమిస్తారని పేర్కొంది.

March 15, 2026 / 02:00 PM IST

విజయ్, శౌర్యువ్ మూవీ కథ ఇదేనా!

వరుస సినిమాలతో బిజీగా ఉన్న రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దర్శకుడు శౌర్యువ్‌తో మూవీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కథలో మైథలాజికల్ అంశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు పౌరాణిక టచ్‌తో కూడిన వినూత్నమైన సోషియో ఫాంటసీ లేదా యాక్షన్ డ్రామాగా ఉండనున్నట్లు టాక్. తన ఇమేజ్‌కు భిన్నంగా, సరికొత్త కథాంశంతో ఈ స్క్రిప్ట్ ఉండటంతో విజయ్ ఈ ప్రాజెక్టుపై ఆసక్తి చూపుతున్నాడట.

March 15, 2026 / 01:38 PM IST

‘సీతా పయనం’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..!

యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో వచ్చిన ‘సీతా పయనం’ మూవీ మిశ్రమ స్పందన తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా OTT రిలీజ్ డేట్ ఖరారైనట్లు తెలుస్తోంది. దీని డిజిటల్ రైట్స్‌ను సన్‌నెక్స్ట్ సొంతం చేసుకున్నట్లు టాక్. మార్చి 20, 2026 నుంచి సదరు OTTలో తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాతో అర్జున్ కూతురు ఐశ్వర్య కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది.

March 15, 2026 / 01:18 PM IST