మెగాస్టార్ చిరంజీవితో దర్శకుడు బాబీ సినిమా చేయనున్నట్లు వార్తలొచ్చిన విషయం తెలిసిందే. ఈ వార్తలను నిజం చేస్తూ మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు. ‘మెగా 158’ వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు వెల్లడిస్తూ పోస్టర్ షేర్ చేశారు. ఇక ఈ చిత్రాన్ని KVN ప్రొడక్షన్స్ నిర్మించనుంది. కాగా.. బాబీ, చిరు కాంబోలో గతంలో ‘వాల్తేరు వీరయ్య’ మూవీ వచ్చిన విషయం తెలిసిందే.
మెగాస్టార్ చిరంజీవితో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఓ సినిమాను తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనే దానిపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ మొదలైంది. ఈ తరుణంలో ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతం అందించనున్నట్లు టాక్ వినిపిస్తుంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.
బాలీవుడ్ నటుడు రజా మురాద్ చనిపోయారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై మురాద్ స్పందించారు. బతికుండానే చనిపోయానని ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతీ ఒక్కరికి సమాధానం ఇవ్వడం చాలా కష్టంగా మారిందన్నారు. తాను బతికే ఉన్నానని పదే పదే చెప్పాల్సి వస్తుందని.. దీని వల్ల శారీరకంగా, మానసికంగా ఎంతో అలసటకు గురయ్యానని తెలిపారు.
బాలీవుడ్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘రామాయణ’పై నిర్మాత నమిత్ మల్హోత్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రామాయణం గురించి ప్రపంచానికి చాటి చెప్పాలనే ఉద్దేశంతో ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. భారతీయ సినీ ప్రేక్షకులే కాదు, పాశ్చాత్య దేశాల వారికి ఈ మూవీ నచ్చకపోతే తమ ఫెయిల్యూర్‌గా భావిస్తామని చెప్పారు. ‘అవతార్’ వంటి హాలీవుడ్ మూవీల స్థాయిలో ఇది ఉంటుందన్నారు.
ఇటీవల రిలీజైన యానిమేషన్ మూవీ ‘మహావతార్ నరసింహ’ బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాస్తుంది. జూలై 25న రిలీజైన ఈ సినిమా ఇప్పటివరకు రూ.278 కోట్లకుపైగా కలెక్షన్స్ సాధించింది. ఈ విషయాన్ని తెలుపుతూ మేకర్స్ పోస్టర్ షేర్ చేశారు. ఇక హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రాన్ని దర్శకుడు అశ్విన్ కుమార్ తెరకెక్కించారు.
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తన ఫిట్‌నెస్ సీక్రెట్ గురించి బయటపెట్టారు. తాను రోజూ సాయంత్రం 6:30లోపు భోజనం చేస్తానని చెప్పారు. అలాగే ప్రతి సోమవారం ఉపవాసం ఉంటానని తెలిపారు. అంతేకాదు ప్రతిరోజూ కనీసం 2 గంటల వ్యాయామం చేస్తానని, ఇంట్లో భోజనానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని వెల్లడించారు.
‘మన శంకరవరప్రసాద్‌గారు’ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి లుక్ ఒరిజినల్ అని దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పారు. VFX చాలా తక్కువ వాడామని, 5% VFX కూడా లేవని అన్నారు. చిరు ఈ లుక్ కోసం ఎంతో కష్టపడ్డారని తెలిపారు. ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ వీడియోకు వాయిస్ ఓవర్ ఇచ్చినందుకు వెంకటేష్‌కు థ్యాంక్స్ చెప్పారు. త్వరలోనే ఆయన మూవీలో ఎంట్రీ ఇవ్వనున్నారని, వీరి కాంబో అదిరిపోతుందన్నారు.
తనపై వస్తోన్న ట్రోల్స్‌పై నిర్మాత నాగవంశీ ఇటీవల పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించారు. ‘నాగవంశీ ఒక దయగల నిర్మాత. ఆయనను ట్రోల్స్ ఎప్పటికీ కూడా కిందకు లాగలేవు. 10 రేట్ల వేగంతో ఆయన ఆకాశమంత ఎత్తుకు ఎదుగుతారు’ అంటూ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్‌లు ఇవాళ ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ మేరకు కిరణ్ వారి క్యూట్ పిక్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. మరోవైపు పలువురు ప్రముఖులు వారికి విషెస్ చెబుతున్నారు. కాగా, 2024 ఆగస్టు 22న కిరణ్, రహస్యల పెళ్లి జరగ్గా.. ఈ ఏడాది మేలో తల్లిదండ్రులయ్యారు. వారికి పండంటి అబ్బాయి పుట్టాడు.
మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆయన మూవీల గురించి ఆసక్తికర విషయాలు వైరలవుతున్నాయి. అయితే చిరు బర్త్ డే రోజు ఒక సినిమా విడుదలైంది. అదే ‘చంటబ్బాయి’. డిటెక్టివ్ కామెడీ సస్పెన్స్ జానర్‌లో దర్శకుడు జంధ్యాల ఈ మూవీని తెరకెక్కించారు. 1986 ఆగస్టు 22న ఇది విడుదల కాగా.. చిరు ఇందులో డిటెక్టివ్ ఆఫీసర్‌గా కనిపించారు. అంతేకాదు నిర్మాత అల్లు అరవింద్ కూడా ఈ మూవీలో నటించారు.
స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన ‘ఘాటీ’ మూవీ సెప్టెంబర్ 5న విడుదల కానుంది. ఈ మూవీని కర్ణాటకలో ‘KGF’ హీరో యష్ తల్లి పుష్ప అరుణ్ కుమార్ డిస్ట్రిబ్యూట్ చేయనున్నారట. తాజాగా ఆమె ‘P.A ఫిల్మ్స్’ అనే డిస్ట్రిబ్యూషన్ సంస్థను స్థాపించారు. అయితే పుష్ప డిస్ట్రిబ్యూట్ చేస్తున్న తొలి చిత్రం ‘ఘాటీ’. ఇక దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఈ మూవీని తెరక...
అనుపమ పరమేశ్వరన్ నటించిన ‘పరదా’ మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. పరదా అనే ఆచారాన్ని పాటిస్తున్న గ్రామానికి చెందిన ఓ యువతి, ఆ పరదా తమను కాపాడలేదనే విషయం తెలిసి.. దాన్ని గ్రామస్తులకు ఎలా నిరూపించిందనేది మూవీ కథ. అనుపమ నటన బాగుంది. మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకువెళ్లాయి. కథ, కథనం బాగుంది. కొన్నిచోట్ల సాగదీత మూవీకి మైనస్. రేటింగ్ 3/5.
మెగాస్టార్ చిరంజీవికి సినీ ప్రముఖులు, అభిమానులు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. తాజాగా ‘హ్యాపీ బర్త్ డే.. వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారు’ అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విషెస్ చెప్పారు. ఆయనతో కలిసి డ్యాన్స్ చేసిన ఫొటోను షేర్ చేశారు. బన్నీతో పాటు విక్టరీ వెంకటేష్, దర్శకుడు హరీష్ శంకర్, నారా రోహిత్, తేజా సజ్జా తదితరులు ఆయనకు విషెస్ చెప్పారు.
పంజాబీ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు జస్విందర్ భల్లా(65) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సినిమాలతో పాటు నాటక రంగంలో జస్విందర్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.