తమిళ హీరో ధృవ్ విక్రమ్ నటించిన ‘బైసన్’ మూవీ తమిళంలో రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాపై సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రశంసలు కురిపించారు. తనకు స్వయంగా కాల్ చేసి అభినందించారని దర్శకుడు మారి సెల్వరాజ్ తెలిపారు. ‘సూపర్ మారి. బైసన్ చూశాను. సినిమా అద్భుతంగా ఉంది. మూవీ విజయం సాధించినందుకు శుభాకాంక్షలు అని చెప్పారు’ అని పేర్కొన్నారు.
తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన ‘డ్యూడ్’ మూవీ మంచి హిట్ అందుకుంది. ఈ సినిమా రూ.100 కోట్ల క్లబ్ దిశగా అడుగులు వేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఈ మూవీ రూ.95 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్ షేర్ చేశారు. ఇక మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకు కీర్తిశ్వరన్ దర్శకత్వం వహించారు.
ఓ తెలుగు వెబ్‌సైట్‌పై ఫైర్ అయిన నిర్మాత రాజేష్ దండా ట్వీట్ చేశారు. ‘నా పోరాటం ఆ వెబ్‌సైట్ పైనే, మీడియా సంస్థలపై కాదు. రేటింగ్ ఇవ్వడంపై అభ్యంతరం లేదు. కానీ మూవీ హిట్ అయ్యాక కూడా నెగిటివ్ వార్తలు రాయడం వల్ల బాధపడ్డా. నేను వాడిన భాష అభ్యంతకరమని అంటున్నారు. రూ.కోట్లు ఖర్చు చేసిన మూవీని చంపేసే ప్రయత్నం చేస్తుంటే కోపం వచ్చి అలా మాట్లాడాను’ అని అన్నారు.
టాలీవుడ్ హీరో నారా రోహిత్, నటి శిరీష(సిరి)ల పెళ్లి పనులు మొదలైన విషయం తెలిసిందే. ఈ నెల 30న వారి పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 27, 28, 29 తేదీల్లో వివాహానికి సంబంధించిన వేడుకలను నిర్వహించనున్నట్లు సమాచారం. మొత్తం నాలుగు రోజుల కార్యక్రమాలతో హైదరాబాద్‌లో రోహిత్, శిరీషల పెళ్లి జరగబోతున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో దర్శకుడు హను రాఘవపూడి పీరియాడికల్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా మేకర్స్ ఈ సినిమాపై సాలిడ్ అప్‌డేట్ ఇచారు. రేపు ఉదయం 11:07 గంటలకు టైటిల్ పోస్టర్‌ను షేర్ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు పోస్టర్ షేర్ చేశారు. ఇక ఈ సినిమాకు ‘ఫౌజీ’ అనే టైటిల్ ఖరారైనట్లు వార్తలొస్తున్న విషయం తెలిసిందే.
మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు సురేందర్ రెడ్డి కాంబోలో తెరకెక్కిన ‘కిక్’ మూవీ మంచి హిట్ అందుకుంది. దీనికి సీక్వెల్ రాగా.. పర్వాలేదనిపించింది. తాజాగా రవితేజ, సురేందర్ రెడ్డి కాంబోలో మరో మూవీ రాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కథ చర్చలు జరుగుతున్నట్లు, ఆ మూవీ విషయంలో రవితేజ ఆసక్తిగా ఉన్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
కేంద్ర మాజీమంత్రి స్మృతి ఇరానీ ప్రధాన పాత్రలో నటిస్తోన్న సీరియల్ ‘క్యోంకీ సాస్ భీ కభీ థీ 2’. ఇందులో మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ 3 ఎపిసోడ్స్‌లో అతిథి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. స్మృతి తులసి పాత్రతో ఆయన వీడియో కాల్‌లో మాట్లాడనున్నారని, దీని ద్వారా ప్రజలకు ఎన్నో విషయాలపై అవగాహన కల్పించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు భాను భోగవరపు కాంబోలో తెరకెక్కిన మూవీ ‘మాస్ జాతర’. OCT 31న రిలీజ్ కానున్న ఈ సినిమాపై నిర్మాత నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మూవీ విడుదలపై ఎలాంటి డౌట్స్ పెట్టుకోవద్దని, దీని ప్రీమియర్స్ కూడా అనుకున్న సమయానికి వేస్తామని వెల్లడించారు. ఈ సినిమా మాస్ ఆడియెన్స్‌తో పాటు కామన్ ప్రేక్షకులను కూడా మెప్పిస్తుందన్నారు.
తమిళ నటుడు ప్రదీప్ రంగనాథన్, దర్శకుడు కీర్తి శ్వరన్ కాంబోలో తెరకెక్కిన ‘డ్యూడ్’ హిట్ అందుకుంది. తాజాగా ఈ సినిమా OTTపై నయా న్యూస్ బయటకొచ్చింది. దీని డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోగా.. నవంబర్ 14 నుంచి సదరు OTTలో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. తమిళంతో పాటు తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది.
కిరణ్ అబ్బవరం నటించిన తాజా చిత్రం ‘K-క్యాంప్’ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఓ వెబ్‌సైట్‌పై నిర్మాత రాజేష్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. బ్లాక్‌బస్టర్ అయినా తమ సినిమాను తొక్కాలని చూస్తున్నారని మండిపడ్డాడు. కావాలనే నెగిటివ్ వార్తలు ప్రచారం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశాడు.
‘K-ర్యాంప్’ సక్సెస్ మీట్‌లో నిర్మాత SKN ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అల్లు అర్జున్‌పై ప్రశంసలు కురిపించాడు. ‘రేసుగుర్రం సినిమాలో బ్రహ్మానందం చివరి పదిహేను నిమిషాల్లో డామినేట్ చేశారు. కానీ ఆయన డామినేట్ చేశారని ఆ రోజు అల్లు అర్జున్ ఫీలవ్వలేదు. ఆ మూవీకి ఏది వర్కవుట్ అవుతుందో అది మాత్రమే చూశాడు. అందుకే ఈరోజు బన్నీ టాప్‌లో ఉన్నాడు’ అని పేర్కొన్నాడు.
తేజ సజ్జా నటించిన ‘మిరాయ్’ మరో రికార్డును సొంతం చేసుకుంది. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ప్రస్తుతం జియో హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటివరకూ 200+ మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ పూర్తి చేసుకున్నట్లు జియో హాట్‌స్టార్ వెల్లడించింది. భారత్, ఇండోనేషియా, మలేషియా, థాయ్‌లాండ్ దేశాల్లో అత్యధిక మంది వీక్షించారు.
దీపావళి కానుకగా నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే, వాటిలో కిరణ్ అబ్బవరం నటించిన ‘K-ర్యాంప్’ టపాస్ గట్టిగా పేలింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.17.5 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. అలాగే.. తెలుసుకదా, డ్యూడ్, మిత్రమండలి సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి.
‘ఓజీ’ నిర్మాతకు, దర్శకుడికి మధ్య విభేదాలంటూ వార్తలొచ్చిన విషయం తెలిసిందే. దీనిపై సుజీత్ స్పందించాడు. ‘OG గురించి చాలామంది ఏవేవో మాట్లాడుకుంటున్నారు. ఈ చిత్రం కోసం నిర్మాత, టీమ్ ఇచ్చిన మద్ధతు మాటల్లో చెప్పలేను. పవన్‌తోపాటు ఆయన అభిమానులు చూపించిన ప్రేమ వర్ణించలేనిది. నిర్మాత దానయ్య సపోర్టు, నమ్మకానికి కృతజ్ఞతలు. ప్రేమ, గౌరవం, కృతజ్ఞతతో సుజీత్’ అని పోస్ట్ విడుదల చేశాడు.