శ్రీసింహా, సత్య ప్రధాన పాత్రల్లో.. రితేష్ రాణా దర్శకత్వం వహించిన మత్తువదలరా-2 మూవీ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. దీంతో సినిమాకు భారీ వసూళ్లు వస్తున్నాయి. కేవలం 10 రోజుల్లోనే రూ.30.01కోట్లు వచ్చినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అలాగే అమెరికాలోనూ 1 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ దాటేసినట్లు తెలిపారు. కాగా తక్కువ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్‌కు ఊహించని ...
బాలీవుడ్ జంట అభిషేక్ బచ్చన్-ఐశ్వర్య రాయ్ త్వరలో విడాకులు తీసుకోబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వారిద్దరూ దూరంగా ఉంటున్నారంటూ ప్రచారం జరిగింది. తాజాగా ఈ వార్తలకు ఐశ్వర్య రాయ్ చెక్ పెట్టింది. ఆమె తమ వెడ్డింగ్ రింగ్ ధరించి ‘పారిస్ ఫ్యాషన్ వీక్’లో పాల్గొంది. దీంతో తాము విడాకులు తీసుకోబోతున్నామంటూ రూమర్స్‌కు చెక్ పెట్టినట్లైంది.
దేవర ప్రీ రిలీజ్ రద్దు కావడంపై అభిమానులకు క్షమాపణలు చెబుతూ ఆర్గనైజేషన్ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘పరిమితులకు మించి పాస్‌లు ఇచ్చామంటూ సోషల్ మీడియాలో జరుగుతోన్న ప్రచారం పూర్తిగా అబద్ధం. 30, 35వేల మంది అభిమానులు హాజరయ్యారు. బారికేడ్లు పగలగొట్టడంతో పరిస్థితి అదుపుతప్పింది. అభిమానుల భద్రత దృష్ట్యా ఈవెంట్ రద్దు చేశాం. బరువెక్కిన హృదయంతో ఈ నోట్‌ను విడుదల చేస్తున్నాం’ అని పేర్కొన్న...
2025 ఆస్కార్‌కు భారత్ నుంచి ‘లాపతా లేడీస్’ సినిమాను ఎంట్రీకి పంపనున్నట్లు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఆట్టం, యానిమల్ తదితర 29 సినిమాల జాబితా నుంచి ఈ సినిమాను ఎంచుకున్నట్లు చెప్పింది. ఈ సినిమాకి బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్‌రావ్ దర్శకత్వం వహించారు. కాగా, ఈ మూవీ ఆస్కార్‌కు వెళ్తుందనే నమ్మకముందని ఇటీవల కిరణ్‌రావ్...
సూపర్ స్టార్ మహేశ్ బాబు న్యూ లుక్ అదిరిపోయింది. పొడవాటి జుట్టు, గడ్డంతో మహేశ్ న్యూలుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. సీఎం రేవంత్ రెడ్డిని మహేశ్ బాబు కలిసి వరద బాధితులకు సహాయార్థం ప్రకటించిన చెక్కును అందించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన లుక్ వైరల్ అవుతోంది. తన తదుపరి చిత్రం SSMB 29లో ఆయన ఈ లుక్‌లో కనిపించనున్నారని సమాచారం.
దేవర రిలీజ్ ట్రైలర్ వ్యూస్‌తో దూసుకుపోతుంది. దీంతో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నెంబర్ వన్‌గా నిలిచింది. ఈ మూవీ ఇప్పటికే 30 మిలియన్ల వ్యూస్‌ను సాధించింది. దీనికి సంబంధించిన పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు. కాగా, యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తోన్న దేవర మూవీ.. ఈ నెల 27వ తేదీన రిలీజ్ అవుతోంది.
TG: వరద బాధితులకు సహాయార్థం సీఎం సహాయనిధికి హీరో మహేష్ బాబు విరాళం అందించారు. సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.60 లక్షల విరాళం ఇచ్చారు. ఈ మేరకు జూబ్లీహిల్స్‌లోని నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి మహేష్ దంపతులు చెక్కు అందజేశారు. సొంత డబ్బులు రూ.50 లక్షలు, AMB తరపున మరో రూ.10 లక్షలు విరాళం అందించారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో రాబోతున్న మూవీ ‘పుష్ప- 2’. పుష్పకు సీక్వెల్‌గా పుష్ప 2 రాబోతుంది. డిసెంబర్ 6న ఈ మూవీ రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ “కౌంట్ డౌన్” పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఫ్యాన్స్ కోరిక మేరకు కేవలం 75 రోజుల్లోనే పుష్పరాజ్ రూలింగ్ చూడబోతున్నట్లు స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు.
బిగ్ బాస్8 హౌస్‌లో 3వ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన అభయ్ నిన్న ఎలిమినేట్ అయ్యారు. హౌస్‌లోకి వెళ్లిన మూడు వారాల తర్వాత ఇంటికి వెళ్లిపోయారు. ప్రారంభంలో అతను స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని అందరూ భావించినా.. గేమ్స్, టాస్క్‌లలో ఎఫెక్టివ్‌గా ఆడలేకపోయారు. దీంతో అతనికి తక్కువ ఓటింగ్ వచ్చింది. కాగా, మూడు వారాలకు ఆరు లక్షల రూపాయలను అభయ్ రెమ్యూనరేషన్‌గా తీసుకున్నట్లు సమాచారం.
సందీప్ కిషన్ కొత్త సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. ‘ధమాకా’ ఫేమ్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా నటించనున్న లేటెస్ట్ సినిమాకు ‘మజాకా’ టైటిల్‌ను మేకర్స్ ఫిక్స్ చేశారు. అంతేకాకుండా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో హీరో సంప్రదాయ ధోతీ లుక్‌లో కనిపించాడు. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి వ...
క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ ‘హరి హర వీరమల్లు’. ఈ చిత్రం మొదటి భాగాన్ని వచ్చే ఏడాది మార్చి 28న విడుదల చేయనున్నారు. ఈ మేరకు మెగా సూర్య ప్రొడక్షన్ ఎక్స్ వేదికగా ప్రకటించింది. అయితే ఈ రోజు ఉదయం 7 గంటలకు విజయవాడలో కొత్త షెడ్యూల్ షూటింగ్ మొదలైందని, పవన్ కళ్యాణ్ జాయిన్ అవుతారని మేక...
దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రఖ్యాత సంగీత దర్శకుడిగా పేరుపొందిన అనిరుధ్, ఇటీవల విజయవంతమైన సినిమాలు అయిన ‘విక్రం’, ‘జైలర్’, ‘బీస్ట్’ వంటి చిత్రాల ద్వారా తన ప్రతిభను నిరూపించుకున్నారు. ఆయన సంగీతం ప్రస్తుతం తెలుగు మరియు తమిళ చలన చిత్ర పరిశ్రమలో ట్రేండింగ్ లో ఉన్నది. అనిరుధ్ ఎప్పుడూ తన కొత్త సినిమాల గురించి ఒక లైన్ పోస్టు చేయడం ద్వారా అభిమానులకు ఉత్సాహాన్ని పంచుతారు. గత రాత్రి, ఆయన తన X ఖాతాలో ‘దేవర’...
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు దేవర ప్రమోషన్స్‌కు సంబంధించి ప్రెస్‌మీట్ కానీ, ఈవెంట్ కానీ జరగలేదు. ఆదివారం జరగాల్సిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ రద్దయింది. ఇవాళ ఉదయం NTR అమెరికాకు వెళ్లిపోయారు. లాస్ ఏంజిల్స్‌లో జరిగే ఫిల్మ్ ఫెస్టివల్ ‘బియాండ్ ఫెస్ట్ 2024’లో దేవర మొదటి షో ప్రదర్శనను వీక్షించనున్నారు. దీంతో దేవర ప్రమోషన్స్ లేనట్టే అని అభిమానులు ఆవేద...
అమెరికా పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రవాస భారతీయుల సదస్సులో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ ఈవెంట్‌లో భారతీయ కళాకారులు ప్రదర్శనలు ఇవ్వగా.. మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ ఓ సాంగ్‌తో ఆడియన్స్‌ను అలరించారు. పుష్ప సినిమాలోని శ్రీవల్లి సాంగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ క్రమంలో స్టేజిపైకి వచ్చిన ప్రధాని మోదీ DSPని కౌగిలించుకొని అభినందించారు. ఇందుకు సంబంధించిన ఫోట...
దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దుపై ఆ సినిమా హీరోయిన్ జాన్వీ కపూర్ స్పందించారు. అచ్చతెలుగులో మాట్లాడుతూ.. ఓ వీడియోను విడుదల చేశారు. తనను ఆదరిస్తున్న అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చెప్పాలనుకున్న మాటలను.. వీడియో ద్వారా ప్రేక్షకుల ముందుంచారు.