✦ ఉత్తమ నటుడు – నాని (తెలుగు), విక్రమ్ (తమిళం)✦ ఉత్తమ నటి – ఐశ్వర్యారాయ్ (తమిళం)✦ సహాయ నటుడు – జయరామ్✦ ఉత్తమ సినిమాటోగ్రఫీ – మిస్‌శెట్టి మిస్టర్ పొలిశెట్టి✦ ఉత్తమ సాహిత్యం – జైలర్ (హుకుం)✦ ఉత్తమ నేపథ్య గాయకుడు – చిన్నంజిరు (తమిళం)✦ ఉత్తమ నేపథ్య గాయని – శక్తిశ్రీ గోపాలన్ (తమిళం)
భారీ అంచనాలతో విడుదలై మిక్స్డ్ టాక్ అందుకున్న దేవర సినిమా.. తొలిరోజు అదిరిపోయే కలెక్షన్లు సాధించినట్లు తెలుస్తోంది. నిన్న ఒక్కరోజే రూ.140కోట్లు వసూలు చేసినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. తెలుగురాష్ట్రాల్లో రూ.60-70 కోట్లు వచ్చినట్లు సమాచారం. హిందీలో రూ.7కోట్లు.. మిగతా భాషలతో పాటు ఓవర్సీస్లో కలుపుకొని రూ.140కోట్లు వచ్చాయని అంచనా. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
‘96’ సినిమాతో ప్రేక్షకుల హృదయాలు దోచుకున్న ప్రేమ్ కుమార్.. ఆరేళ్ల తరువాత కార్తీ, అరవింద్ స్వామీలతో మరో ఎమోషనల్ సినిమాతో ముందుకొచ్చారు. సినిమా కాస్త నెమ్మదిగా కొనసాగినా అన్ని రకాల ఎమోషన్స్‌తో అదరగొట్టారని చెప్పవచ్చు. పూర్తిగా గ్రామీణ వాతావరణంతో సాగిన ఈ కథతో.. ప్రేక్షకులను దర్శకుడు గతంలోకి తీసుకెళ్లాడు. ముఖ్యంగా కార్తీ, అరవింద్ స్వామీల మధ్య సాగే కథ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ర...
మెగాస్టార్ చిరంజీవిని మరో ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. యూఏఈలోని అబుదాబిలో ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ(IIFA) అవార్డ్స్- 2024 వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో ‘ఔట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇండియన్ సినిమా’ అవార్డును చిరు అందుకున్నారు. ఈ అవార్డు రావడం పట్ల చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చిరుని బాలయ్య కౌగిలించుకున్నారు.
ఇటీవల విడుదలై ప్రేక్షకులను అలరించిన ’35- ఓ చిన్న కథ కాదు’ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’ వేదికగా అక్టోబరు 2వ తేదీ నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. సెప్టెంబర్ 6న థియేటర్లలో విడుదలైన ’35- ఓ చిన్న కథ కాదు’ సినిమా సంచలన విజయం సాధించింది. నివేదా థామస్, ప్రియదర్శి కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు బాగా ఆదరించారు.
సుప్రీంకోర్టులో ‘12th ఫెయిల్’ సినిమాను ప్రదర్శించారు. ఐపీఎస్ మనోజ్ కుమార్ శర్మ జీవితం ఆధారంగా విధు వినోద్ చోప్రా దర్శకత్వం వహించిన చిత్రం ‘12th ఫెయిల్’. విక్రాంత్ మస్సే కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం తాజాగా అరుదైన గౌరవాన్ని అందుకుంది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌తో పాటు దాదాపు 600 మంది న్యాయవాదులు, ఇతర అధికారుల కోసం సుప్రీంకోర్టులో దీనిని ప్రత్యేకం...
తమలపాకులతో పలు సమస్యలకు చెక్ పెట్టవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. మలబద్ధకం సమస్య దూరం అవుతుంది. శ్వాస సంబంధిత సమస్యలు తగ్గుతాయి. నోటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్త ప్రసరణ సాఫీగా సాగుతుంది. నిద్రలేమి సమస్య నుంచి బయటపడవచ్చు. కీళ్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి.
‘దేవర’ రిలీజైన సందర్భంగా NTR ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. తాను ఎంతోకాలం నుంచి ఎదురుచూస్తున్న రోజు వచ్చిందన్నారు. తనపై అభిమానులు చూపిస్తున్న ప్రేమకు ఎప్పుడూ రుణపడి ఉంటానని పేర్కొన్నారు. అద్భుతమైన డ్రామా, భావోద్వేగాలతో దేవరను తెరకెక్కించిన కొరటాల శివకు, మంచి సంగీతం అందించిన అనిరుధ్, నిర్మాతలు, మూవీ టీం అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. తన ఫ్యాన్స్‌కు మరింత వినోదాన్...
US: లాస్ ఏంజిల్స్‌లో జరిగిన బియాండ్ ఫెస్ట్‌లో దేవరను ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో అందులో పాల్గొన్న ఎన్టీఆర్.. అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా జపాన్‌లోని టోక్యో నుంచి వచ్చిన ఓ మహిళా అభిమాని.. జపాన్‌కు రమ్మని ఎన్టీఆర్‌ను ఆహ్వానించింది. దీంతో ‘మీ దేశానికి తప్పకుండా వస్తా’ అని ఆమెకు ఎన్టీఆర్ మాటిచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
బాలీవుడ్‌కు చెందిన పలువురు సెలబ్రిటీలు డేటింగ్ యాప్ వాడుతున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ లిస్ట్‌లో నటి ఊర్వశీ రౌతేలా పేరు కూడా ఉంది. తాజాగా దీనిపై ఆమె స్పందించింది. తాను డేటింగ్ యాప్‌ను వాడుతున్నట్లు తెలిపింది. డేటింగ్ కోసం కాదని, తన స్నేహితులతో మరింత కనెక్ట్ అవ్వడానికి మాత్రమేనని స్పష్టం చేసింది. తనతో పాటు చాలా మంది సెలబ్రిటీలు అందులో ఉన్నట్లు పేర్కొంది.
బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తన మూవీ నుంచి ప్రధాన నటుడిని తీసేసినట్లు తెలిపారు. అతని మేనేజర్ కారణంగానే అలా చేసినట్లు పేర్కొన్నారు. ఒక పేరుపొందిన ఏజెన్సీకి చెందిన ఆ మేనేజర్ పొగరు, అహంకారంతో వ్యవహరించడని.. అది తనకు నచ్చలేదని అన్నారు. వర్క్‌షాప్ నిర్వహించి అలాంటి వారికి శిక్షణ ఇవ్వాలని సూచించారు. కాగా, ఆ నటుడి వివరాలు మాత్రం చెప్పలేదు.
దర్శకుడు శంకర్ ఓ మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. తమిళ స్టార్ హీరోలు విక్రమ్, సూర్యను ఆయన డైరెక్ట్ చేయనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం శంకర్ ‘గేమ్ ఛేంజర్’ మూవీతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత ఇండియన్ 3 మూవీని పూర్తి చేసే ఆలోచనలో ఆయన ఉన్నారట.
తమిళ హీరో శివ కార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘అమరన్’. ఈ మూవీ నుంచి సాయి పల్లవి పాత్రకు సంబంధించిన ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఆమె ఇందులో ఇందు రేబాక వర్గీస్ అనే పాత్రలో కనిపించనుంది. ఇక రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
రాజమౌళితో సినిమా తీసిన తర్వాత హీరోల నెక్స్ట్ మూవీ ఫ్లాప్ అవుతుందనే సెంటిమెంట్‌ను ఎన్టీఆర్ బ్రేక్ చేశారని SS కార్తికేయ ట్వీట్ చేశారు. ’23 ఏళ్ల క్రితం ఎవరితో అయితే ఆ సెంటిమెంట్ మొదలైందో చివరికి ఆ వ్యక్తితోనే అది బ్రేక్ అయింది. ఎన్టీఆర్‌ను దగ్గరి నుంచి చూస్తూ పెరిగాము. ఇప్పుడు ఆయన అద్భుతాలకు సాక్షులు కావడం ఎంతో ప్రత్యేకం. దేవర మాస్ అదిరిపోయింది. ఇది అభిమానులకు తారక్ ఇచ్చిన స్పెషల్ ...
AP: తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. స్వామివారి లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వును వినియోగించారన్న వార్తలపై తాజాగా హీరోయిన్ ఖుష్బూ స్పందించారు. కల్తీకి పాల్పడ్డవారు ఎవరైనా సరే మూల్యం చెల్లించుకోవాల్సిందేనని అన్నారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అన్నీ చూస్తున్నాడంటూ ఖుష్బూ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ పెట్టారు.