పుష్ప 2 రిలీజ్‌కు ముందు నటుడు నాగబాబు ఆసక్తికర ట్వీట్ చేశారు. ’24 క్రాఫ్ట్ ల కష్టంతో, వందల మంది టెక్నీషన్ల శ్రమతో వేల మందికి ఉపాధి కలిగించి, కోట్ల మందిని అలరించేదే సినిమా.. ప్రతి సినిమా విజవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం…అందరిని అలరించే సినిమాలనే ఆదరించాలని, ప్రతి మెగా అభిమానిని, ప్రతి సినీ అభిమానిని కోరుకుంటున్నాను’ అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.