ADB: పట్టణంలోని జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ రాజర్షి షా అర్జీదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. వివిధ శాఖలకు సంబంధించి 131 అర్జీలు వచ్చినట్లు తెలిపారు. అర్జీదారుల సమస్యలను సంబంధిత అధికారులు తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు.