VSP: పీజీఆర్ఎస్ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ సోమవారం 348 ప్రజా వినతులను స్వీకరించారు. సమస్యలపై సంబంధిత అధికారులు ఫిర్యాదుదారులతో ఫోన్లో మాట్లాడాలని, నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలని కలెక్టర్ ఆదేశించారు. రెవెన్యూ, జీవీఎంసీ, పోలీస్ తదితర శాఖలకు సంబంధించిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని స్పష్టం చేశారు.