TG: రాష్ట్రంలో పెద్ద ఎత్తున రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టడం ఇదే తొలిసారి అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గతంలో 90శాతం రేషన్ బియ్యం వృథాగా పోయాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది బీఆర్ఎస్ హయాంలోనే.. కూలింది వాళ్ల హయంలోనే అని ఎద్దేవా చేశారు. దేవాదుల ప్రాజెక్టు ప్యాకేజీ-6 పనులు ఆగిపోయాయన్నారు. దేవాదుల నుంచి పాలకుర్తికి జలాలు తీసుకొస్తామని హామీ ఇచ్చారు.