NDL: నంద్యాల ట్రాఫిక్ సీఐ మల్లికార్జున గుప్తా ఆధ్వర్యంలో పట్టణ కేంద్రంలోని నేషనల్ డిగ్రీ కాలేజ్ వద్ద విద్యార్థులకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. వారు మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనంపై వెళ్లేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్‌ను ధరించాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ లైసెన్స్, వాహనానికి సంబంధించిన సరైన ధ్రువపత్రాలు కలిగి ఉండాలని పేర్కొన్నారు.