VSP: జీవీఎంసీ “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంలో మొత్తం 154 వినతులు వచ్చాయని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు తెలిపారు. వివిధ జోన్లు, విభాగాలకు చెందిన వినతులు ఉన్నాయి. ఈ సమస్యలపై అదే రోజు స్పందించి పరిష్కరించాలని కమిషనర్ కేతన్ గార్గ్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.