KMM: ఏన్కూరు ఎడమ కాలువకు వ్యవసాయ సాగు నిమిత్తం సోమవారం MLA రాందాస్ నాయక్ సీతారామ లింక్ కెనాల్ ద్వారా నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా గంగమ్మకు ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్, కార్పొరేషన్ ఛైర్మన్ రాయల పాల్గొన్నారు.