NTR: పేదల అభ్యున్నతి, రాష్ట్ర అభివృద్ధికై ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు నిరంతరం పనిచేస్తున్నారని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. మైలవరంలో పెద్ద హరిజనవాడ, రాజంపేటలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ తిరుగుతూ టీడీపీ నాయకులు ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేశారు.