SRD: అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినట్లు ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. మండలంలోని అంత్వార్ గ్రామంలో లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు నియోజకవర్గానికి 3500 ఇళ్లు మంజూరు చేసిందని చెప్పారు. ఇళ్ల నిర్మించుకుంటే బిల్లులు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.