NDL: జూపాడు మండల కేంద్రంలో శిథిలావస్థకు చేరుకున్న 90,000వేల లీటర్ల వాటర్ ట్యాంక్ తొలగించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నాగేశ్వరరావు, మండల కన్వీనర్ కర్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం కమ్మపేటలో పర్యటించి, మాట్లాడారు. ఎమ్మెల్యే, అధికారులు దృష్టికి తీసుకెళ్లినా, సమస్య పరిష్కారం కాలేదని, మండల కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు.