KMR: ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టిన ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వమే నేడు బకాయిలను పెండింగ్లో పెట్టడం శోచనీయమని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు రజనీకాంత్ పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఎస్ఎఫ్ఐ (SFI) ఆధ్వర్యంలో విద్యార్థులు కలెక్టరేట్ ముట్టడించారు.