BDK: బూర్గంపాడు మండలంలోని జడ్పీహెచ్ఎస్ మోరంపల్లి బంజర్ పాఠశాల ఉపాధ్యాయుడు తేజావత్ మోహన్ జాతీయ స్థాయి శిక్షణకు ఎంపికయ్యారు. జూలై 16 నుంచి ఆగస్టు 5 తేదీ వరకు రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయపూర్లో నిర్వహించే శిక్షణలో ఆయన పాల్గొనున్నారు. ఈ సందర్భంగా డీఈవో వెంకటేశ్వర చారి, ఎంఈవో వై.సింహరాజు, పీఆర్టీయూ జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు భాస్కరరావు ప్రత్యేకంగా అభినందించారు.