NDL: వెలుగోడులోని ఎరువుల దుకాణాలపై సోమవారం వ్యవసాయ, విజిలెన్స్ బృందాల మెరుపు దాడులు నిర్వహించారు. వెలుగోడులోని శ్రీ సాయి శ్రీనివాస, దుర్గా భవాని ఫర్టిలైజర్స్ దుకాణాల్లో రూ.13 లక్షల విలువైన ఎరువుల నిల్వలకు సరైన రికార్డులు లేకపోవడంతో విక్రయాలను నిలిపివేశారు. రైతులకు నాణ్యమైన ఎరువులు అందించడానికి, అక్రమాలను అరికట్టడానికి ఈ తనిఖీలు చేపట్టారన్నారు.
Tags :