KKD: పెద్దాపురం సిల్క్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం గర్వించ దగ్గ విషయమని మంగళవారం మాజీ ఆప్కో డైరెక్టర్ ముప్పన వీర్రాజు పేర్కొన్నారు. వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ పథకంలో జాతీయ స్టాయిలో అవార్డు రావడం వల్ల పెద్దాపురం చేనేత పరిశ్రమకు జీవం పోసినట్లు అయ్యిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మేరకు చేనేత కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగుపడాయని తెలిపారు.