శ్రీవిష్ణు హీరోగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘మృత్యుంజయ్’ మార్చి 6న రిలీజై మిశ్రమ స్పందన తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా OTT రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. దీని డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. అయితే ఏప్రిల్ 3, 2026 నుంచి సదరు OTTలో స్ట్రీమింగ్ కానుంది. ఇక హుస్సేన్ షా కిరణ్ తెరకెక్కించిన ఈ మూవీలో రెబా మోనికా జాన్ నటించగా, కాల భైరవ సంగీతం అందించాడు.
నార్త్ అమెరికాలో ‘బాహుబలి 2′($20.78M) పేరిట 9 ఏళ్లుగా ఉన్న రికార్డును ‘ధురంధర్ 2’ తిరగరాసింది. $21 మిలియన్లకుపైగా వసూళ్లతో అత్యధిక గ్రాస్ సాధించిన ఇండియన్ మూవీగా నిలిచింది. దీనిపై ‘బాహుబలి’ నిర్మాత శోభు యార్లగడ్డ స్పందిస్తూ.. మూవీ నచ్చిందని, కొత్త బెంచ్ మార్క్ సెట్ చేయడం సంతోషంగా ఉందన్నాడు. ఈ మూవీ కేవలం 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ₹1,226 కోట్లకుపైగా వసూళ్ల...
శర్వానంద్, అభిలాష్ రెడ్డి కాంబోలో వస్తున్న స్పోర్ట్స్ అండ్ ఫ్యామిలీ డ్రామా ‘బైకర్’ ఏప్రిల్ 3న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు పూర్తయ్యాయి. సెన్సార్ సభ్యులు ఈ మూవీకి U/A సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ సినిమా మొత్తం 2:43 గంటల నిడివితో రాబోతుంది. ఇక ఈ సినిమాలో మాళవిక నాయర్, రాజశేఖర్ కీలక పాత్రలు పోషించారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ రూపొందించిన మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’. మార్చి 19న రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయింది. తాజాగా ఈ మూవీ OTTపై అప్‌డేట్ వచ్చింది. దీని OTT రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోగా.. ఏప్రిల్ 24, 2026 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. కాగా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న పీరియడ్ వార్ డ్రామా ‘ఫౌజీ’. తాజాగా ఈ సినిమా విడుదలపై లేటెస్ట్ బజ్ నెలకొంది. ఈ చిత్రాన్ని 2026,ఆగస్టు 14 లేదా దసరా కానుకగా విడుదల చేయాలని మేకర్స్ పప్లాన్ చేస్తున్నారట. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాతో ఇమాన్వీ టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది.
రుష్య దత్త టాలీవుడ్‌కు హీరోగా పరిచయమవుతున్న కామెడీ ఎంటర్‌టైనర్ ‘డాన్ బాస్కో’. రాధా కృష్ణ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ ఉప్పుటూరి నిర్మిస్తున్న ఈ మూవీలో మిర్నా మీనన్ హీరోయిన్. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను తాజాగా విడుదల చేశారు. ఇందులో రుష్య దత్త చేతిలో కత్తితో స్టైలిష్‌గా కనిపిస్తూ ఆకట్టుకుంటున్నాడు.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వశిష్ట దర్శకత్వంలో భారీ VFXతో రూపొందుతున్న ఈ మూవీ పనులు ప్రస్తుతం చివరి దశకు చేరుకున్నాయి. త్వరలోనే మేకర్స్ ఒకేసారి డబుల్ ట్రీట్ ఇచ్చేలా ప్లాన్ చేస్తోంది. ఒక పవర్‌ఫుల్ ట్రైలర్‌తో పాటు, కొత్త రిలీజ్ డేట్‌ను కూడా అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం.
అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న ‘లెనిన్’ చిత్రం వాయిదా పడింది. ముందుగా ఈ సినిమాను మే 1న విడుదల చేయాలని భావించినప్పటికీ, తాజాగా 2026, జూన్ 26కి మార్చారు. రామ్ చరణ్ – బుచ్చిబాబుల ‘పెద్ది’ చిత్రం ఏప్రిల్ 30న విడుదలవుతుండటంతో, బాక్సాఫీస్ వద్ద పోటీని నివారించేందుకు చిత్ర బృందం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో అఖిల్ ఫ్యాన్స్ మరికొంత కాలం వేచి చూడాల్సిందే.
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబోలో మరో మాస్ యాక్షన్ సినిమా సిద్ధమవుతోంది. ముంబై బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నయనతార ప్రధాన కథానాయికగా నటిస్తుండగా, తాజాగా రెండో హీరోయిన్‌గా డింపుల్ హయాతి ఎంపికైనట్లు తెలుస్తోంది. సెకండాఫ్‌లో వచ్చే కీలక పాత్రలో ఆమె మెరవనుందట. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌లో దశలో ఉంది.
బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘హై జవానీతో ఇష్క్ హోనా హై’. డేవిడ్ ధావన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో పూజ హెగ్డే, మృణాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలో ఈ ఇద్దరు నాయికల కాంబోలో ఓ సాంగ్ రాబోతున్నట్లు సమాచారం. వీరిద్దరి ప్రత్యేక స్టెప్పులతో ప్రేక్షకులను అలరించేలా ఈ పాట ఉంటుందట. ఈ రొమాంటిక్ డ్రామా జూన్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
స్టార్ మా: కుబేర(8AM), సంతాన ప్రాప్తిరస్తు(1PM), ప్రేమంటే(3.30PM); జీతెలుగు: ది గ్రేట్ ఇండియన్ కిచెన్(9AM), శతమానం భవతి(12PM), తండేల్(2.30PM); జెమిని: నాంది(6AM), శివరామరాజు(9AM), విజిల్ (12PM), ఊపిరి(3.30PM), గుంటూరు కారం(6PM), దేవుడు చేసిన మనుషులు(10.30PM); స్టార్‌మా మూవీస్:చంద్రముఖి(12PM), KGF(3PM), పరుగు(6PM), సింగం-3(9PM); జీ సినిమాలు: 777 చార్లీ(3PM), ఘర్షణ(6PM).
దర్శకుడు వెట్రిమారన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘ప్రస్తుతం ప్రతిదీ ప్రచారంగా మారుతోంది. నోట్ల రద్దు వల్ల ప్రజలు పడ్డ కష్టాలను ద్వేషపూరిత ప్రచారంతో మార్చేస్తున్నారు’ అని ఆయన మండిపడ్డాడు. ఇలాంటి ప్రచార చిత్రాలకు వ్యతిరేకంగా వాస్తవాలను చూపే సినిమాలు రావాలని ఆయన పిలుపునిచ్చాడు. అయితే, ‘ధురంధర్-2’ను ఉద్దేశించే ఆయన ఈ విమర్శలు చేశారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
తమిళ దర్శకుడు వెట్రిమారన్ ‘నీలిర’ ట్రైలర్ లాంచ్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ప్రస్తుతం ప్రతిదీ ప్రచారంగా మారుతోంది. నోట్ల రద్దు వల్ల ప్రజలు పడ్డ కష్టాలను ద్వేషపూరిత ప్రచారంతో మార్చేస్తున్నారు’ అని ఆయన మండిపడ్డాడు. ఇలాంటి ప్రచార చిత్రాలకు వ్యతిరేకంగా వాస్తవాలను చూపే సినిమాలు రావాలని ఆయన పిలుపునిచ్చారు. అయితే, ‘దురందర్ 2’ను ఉద్దేశించే ఆయన ఈ విమర్శలు చేశారని...
తనకు కులం, మతం లేదని ధ్రువీకరించే సర్టిఫికెట్ కోసం తమిళ నటుడు పార్తిబన్ చెన్నైలో దరఖాస్తు చేశాడు. ఇటీవల తన కులాన్ని ప్రస్తావించి విమర్శలు ఎదుర్కోవడంతో ఆయన ఈ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తనపై వచ్చిన విమర్శలు బాధించాయని, ఈ సర్టిఫికెట్ ద్వారా సమాజంలో మార్పు తెస్తానని ఆయన పేర్కొన్నాడు. దీనిని ఒక ఉద్యమంలా ముందుకు తీసుకెళ్తానని పార్తిబన్ వెల్లడించాడు.
‘పుష్ప’ మూవీతో టాలీవుడ్‌లో ఫహాద్ ఫాజిల్ విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఆయన ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’ తప్ప మరే ఇతర తెలుగు ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. విలన్ పాత్రల కోసం ఆయన ఏకంగా రూ.15-20 కోట్ల భారీ పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. అంత పెద్ద మొత్తం ఇవ్వలేక టాలీవుడ్ నిర్మాతలు వెనుకంజ వేయడంతో, ఆయనకు అవకాశాలు తగ్గుతున్నాయని టాక్ నడుస్తోంది.