కొచ్చిలో 70వ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకల్లో ‘అమరన్’, ‘భ్రమయుగం’ మూవీలు సత్తా చాటాయి. ‘అమరన్’ సినిమా ఏకంగా నాలుగు అవార్డులను కైవసం చేసుకోగా, ‘భ్రమయుగం’ రెండు పురస్కారాలను అందుకుంది. ఈ చిత్రాల్లో అద్భుత నటన కనబరిచిన హీరోలను ‘ఉత్తమ నటుడు’ అవార్డులు వరించాయి. దక్షిణాది సినీ ప్రముఖుల సమక్షంలో ఈ వేడుక కనువిందుగా సాగింది.