బాలీవుడ్ నటి అయేషా ఖాన్ పేరు మీద నకిలీ వాట్సాప్ అకౌంట్లు సృష్టించి పలువురిని సంప్రదిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. దీనిపై స్పందించిన అయేషా.. ఆ ఫేక్ చాట్ స్క్రీన్షాట్లను, ఫోన్ నంబర్‌ను షేర్ చేస్తూ హెచ్చరించింది. ‘ఇది నా అకౌంట్ కాదు, నమ్మకండి’ అని స్పష్టం చేసింది. అపరిచితులకు వ్యక్తిగత వివరాలు లేదా డబ్బు పంపవద్దని ప్రజలను కోరింది.