డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల కాకినాడ పోర్టులో హల్చల్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన అనంతరం పవన్ వాడిన ‘సీజ్ ద షిప్’ పదం తీవ్ర సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌కి చెందిన ‘ఆర్ ఫిలిం ఫ్యాక్టరీ’ నిర్మాణ సంస్థ తాజాగా సీజ్ ద షిప్ అనే టైటిల్‌ను రూ.1,100కు రిజిస్ట్రేషన్ చేసుకుంది. ఏడాది పాటు టైటిల్ హక్కులు వర్తించనున్నాయి.