టాలీవుడ్ హీరోలు వరుసగా పెళ్లి పీటలెక్కుతున్నారు. తాజాగా, బెల్లకొండ సాయి శ్రీనివాస్ కూడా వివాహానికి సిద్ధమవుతున్నారు. వచ్చే ఏడాది ఆయన విహహం జరగనున్నట్లు శ్రీనివాస్ తండ్రి, ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ వెల్లడించారు. శ్రీనివాస్ వివాహం పెద్దల అంగీకారంతోనే జరుగుతుందని, దీనిపై త్వరలో అధికారిక ప్రకటన విడుదల చేస్తామని తెలిపారు. కాగా, శ్రీనివాస్ నటించిన మల్టీస్టారర్ మూవీ ‘భైరవం’ ఈనెల 20న విడుదల కానుంది.